Asian Games 2023: చరిత్ర సృష్టించిన భారత్.. 41 ఏళ్ల తర్వాత ఆ విభాగంలో స్వర్ణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్ మరో బంగారు పతకాన్ని సాధించింది. ఈక్వస్ట్రియన్(గుర్రపు స్వారీ) విభాగంలో బంగారు పతకం సాధించిన భారత్.. 41 ఏళ్ల తర్వాత ఈ విభాగంలో స్వర్ణం సాధించడం గమనార్హం. 1982 తర్వాత ఆసియా క్రీడల్లో భారత్ తొలిసారిగా ఈక్వెస్ట్రియన్‌లో బంగారు పతకం సాధించింది. టీమ్ డ్రస్సేజ్ ఈవెంట్‌లో భారత జట్టు మొత్తం 209.205 స్కోరుతో అగ్రస్థానంలో ఉండగా, చైనా 204.882తో రజతంతో ముగించగా, హాంకాంగ్ 204.852తో 3వ స్థానంలో నిలిచింది. సుదీప్తి హజెలా (చిన్స్కీ – గుర్రం పేరు), హృదయ్ విపుల్ ఛేడా (కెమ్‌క్స్‌ప్రో ఎమరాల్డ్), అనుష్ అగర్వాలా (ఎట్రో), దివ్యకృతి సింగ్ (అడ్రినాలిన్ ఫిర్‌ఫోడ్)లతో కూడిన భారత బృందం ఈక్వెస్ట్రియన్‌లో డ్రస్సేజ్ ఈవెంట్‌లో భారతదేశానికి మొదటి బంగారు పతకాన్ని సాధించి చరిత్రను లిఖించింది. డ్రెస్సేజ్ టీమ్ ఈవెంట్‌లో జట్టు మొత్తం స్కోర్ కోసం టాప్ 3 పెర్ఫార్మర్స్ స్కోర్ మాత్రమే పరిగణించబడుతుంది. అనూష్ అగర్వాలా స్కోరు 71.088 సంచలన ప్రదర్శన చేసి చివరిగా వెళ్లి భారత్ పతక ఆశలను పెంచాడు. ఆసియా క్రీడల్లో ఈక్వెస్ట్రియన్‌లో భారత్‌కు ఇది నాల్గవ స్వర్ణం కాగా.. ఈవెంట్ వారీగా వారి 13వ పతకం. ఈక్వెస్ట్రియన్‌లో భారతదేశం సాధించిన 3 బంగారు పతకాలు 1982 ఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడలలో వచ్చాయి.
Also Read: AP Fibernet Scam: ఏపీ ఫైబర్ నెట్ స్కాం.. రూ.114 కోట్లు కొట్టేశారు
Also Read
- Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
- Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
- SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
- Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
ఇదిలా ఉండగా.. దీనికి ముందు సెయిలింగ్‌లో భారత్‌కు ఇవాళే(సెప్టెంబర్ 26) మూడు పతకాలు లభించాయి. భారత సెయిలర్లు నేహా ఠాకూర్ రజతం సాధించగా… ఎబాద్ అలీ, విష్ణు శరవణన్ కాంస్య పతకాలు సాధించారు. ఆసియా క్రీడల్లో మూడో రోజు మధ్యాహ్నం సమయానికి భారత పతకాల సంఖ్య 14కు (3 స్వర్ణాలు, 4 రజతాలు, 7 కాంస్య పతకాలు) చేరింది. పతకాల పట్టికలో చైనా 78 పతకాలతో టాప్‌లో కొనసాగుతుండగా.. భారత్ ప్రస్తుతం ఆరో స్థానంలో ఉంది.
https://twitter.com/WeAreTeamIndia?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1706614788686590225%7Ctwgr%5Ec5166cb526eabe1624db6a563f87157633da03e7%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.indiatoday.in%2Fsports%2Fasian-games-2023%2Fstory%2Fasian-games-2023-india-win-gold-medal-in-equestrian-after-41-years-script-history-in-dressage-team-2440712-2023-09-26
Victory lap by our gold medalists! Incredible performance today to win the 🥇 🇮🇳 #Cheer4india#WeAreTeamIndia | #IndiaAtAG22 | #Equestrian pic.twitter.com/BSVXbGdVOg
— Team India (@WeAreTeamIndia) September 26, 2023
తాజావార్తలు
-
SS Rajamouli: బాహుబలి ‘కిలికి’ని మించేలా జక్కన్న సరికొత్త ప్రయోగం.. !
-
Nana Patekar: కార్గిల్ వార్‌లో నానా పటేకర్.. అల్విదా నానా భాయ్!
-
Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
-
Nara Lokesh : ఏపీలో దుర్గాదేవి మండపాలకు మంత్రి నారా లోకేష్ తీపి కబురు
-
Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!