ఆసియా కప్ లో భాగంగా సూపర్-4లో భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. అనుకున్న సమయం కంటే గంటకు పైగా ఆలస్యంగా ప్రారంభమైంది. నిన్న 24.1 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన టీమిండియా.. రెండో రోజు అక్కడి నుంచే బ్యాటింగ్ మొదలెట్టింది. నిన్న మ్యాచ్ నిలిచిపోయే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసిన టీమిండియా.. ఇవాళ కూడా దూకుడుగా ఆటను ప్రారంభించారు.
శ్రీలంక రాజధాని కొలంబోలో భారీ వర్షం పడుతుంది. దీంతో భారత్-పాక్ మ్యాచ్ మరింత ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఈ ఉదయం వాతావరణం పొడిగా ఉన్నప్పటికీ.. ఇవాళ భారత్-పాకిస్తాన్ మ్యాచ్ పూర్తవుతుందని అందరూ భావించారు. కానీ ఉన్నట్టుంది ఒక్కసారిగా వాతావరణం తారుమారై వర్షం కురిసింది. కొలంబోలో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తుంది. దీంతో గ్రౌండ్ మొత్తం కవర్లతో కప్పివేశారు.
ఆసియా కప్ 2023 టోర్నీ సూపర్ 4 రౌండ్‌లో ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ వర్షం కారణంగా రిజర్వ్ డేకు వాయిదా పడింది. టాస్ గెలిచిన పాక్ జట్టు బౌలింగ్ ఎంచుకోగా.. భారత జట్టు బ్యాటింగ్ బరిలోకి దిగింది.
ఆసియా కప్ 2023లో భాగంగా కొలంబో వేదికగా భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ సూపర్- 4 మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ తన పేరిట ఓ ప్రత్యేక రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా భారత్ తరఫున రోహిత్ 300 మ్యాచ్‌లు పూర్తి చేశాడు.
ఆసియా కప్ 2023లో సూపర్-4 దశలో భాగంగా పాకిస్థాన్‌తో టీమిండియా తొలి మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో భారత అభిమానుల చూపు విరాట్ కోహ్లీపైనే ఉంది. ఈ మ్యాచ్ ద్వారా కింగ్ కోహ్లి తన పేరిట ఉన్న రికార్డును ప్రస్తుతం మాజీ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పేరిట నెలకొల్పాలని భావిస్తున్నాడు. విరాట్ కోహ్లీ వన్డేల్లో అత్యంత వేగంగా 13,000 పరుగులు పూర్తి చేస్తే ప్రపంచ రికార్డు సాధిస్తాడు.
ఆసియన్ కప్ 2023లో భాగంగా.. మరికాసేపట్లో భారత్, పాకిస్తాన్ మధ్య గ్రూప్-4 మ్యాచ్ ప్రారంభంకానుంది. కొలంబోలో జరుగనున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం.. ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పాక్ జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది.
రేపు(శనివారం) శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ బంగ్లాదేశ్‌కు ‘డూ ఆర్ డై’ లాంటిది. శ్రీలంకపై బంగ్లాదేశ్ ఓడిపోతే.. నిష్క్రమించడం దాదాపు ఖాయం.
ఆసియా కప్ 2023 టోర్నీలో ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ కే రిజర్వ్ డే అవకాశం ఇచ్చారు. ఇప్పటికే లీగ్ దశలో ఇండియా - పాకిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయిన విషయం తెలిసిందే. అయితే ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది.
ఆసియా కప్ లో భాగంగా సూపర్-4 తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యా్చ్ లో 7 వికెట్ల తేడాతో పాక్ గెలుపొందింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 194 పరుగుల టార్గెట్ ను పాకిస్తాన్ 39.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి సాధించింది.
ఆసియా కప్ 2023 నుంచి ఆఫ్ఘనిస్తాన్ జట్టు నిష్క్రమించింది. ఆ జట్టు కప్ నుంచి నిష్క్రమించిన ఒక రోజు తర్వాత ఆఫ్ఘన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ట్విట్టర్ వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఆసియాకప్‌లో భాగంగా శ్రీలంకతో లాహోర్‌లో జరిగిన మ్యాచ్లో ఆఫ్ఘనిస్థాన్‌ను దురదృష్టం ఓడించింది.