IND vs PAK: ఆగని వర్షం.. రిజర్వ్ డేకు ఇండియా- పాక్ మ్యాచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs PAK: ఆసియా కప్ 2023 టోర్నీ సూపర్ 4 రౌండ్‌లో ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ వర్షం కారణంగా రిజర్వ్ డేకు వాయిదా పడింది. టాస్ గెలిచిన పాక్ జట్టు బౌలింగ్ ఎంచుకోగా.. భారత జట్టు బ్యాటింగ్ బరిలోకి దిగింది. 24.1 ఓవర్లలో భారత జట్టు 2 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసిన తర్వాత వర్షం మొదలైంది. దాదాపు రెండు గంటల విరామం తర్వాత వర్షం ఆగిపోగా.. తిరిగి ఆట ప్రారంభం అవుతుందనగా మళ్లీ వర్షం ప్రారంభమైంది. దీంతో మ్యాచ్‌ను రిజర్వ్ డేకు వాయిదా వేశారు. నేడు మ్యాచ్ ఆగిపోయేసరికి భారత స్కోరు 147/2. క్రీజులో కేఎల్ రాహుల్ (17), విరాట్ కోహ్లీ(8) ఉన్నారు.
Also Read: IND vs PAK Live Updates: మళ్లీ వర్షం.. మ్యాచ్ రిజర్వ్ డేకు వాయిదా
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
సాయంత్రం 04:53 గంటలకు వర్షం అంతరాయంతో ఆట ఆగిపోగా.. 05:55 నిమిషాలకు వర్షం నిలిచిపోయింది అయితే అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో అంపైర్లు 7గంటలకు, 7:30 గంటలకు, 8 గంటలకు, 8:30 గంటలకు పిచ్‌ను పరిశీలించారు. చిత్తడిగా మారిన పిచ్‌ను ఆరబెట్టేందుకు మైదానం సిబ్బంది ఫ్యాన్స్‌ను తీసుకువచ్చారు. ఎట్టకేలకు మ్యాచ్ 9గంటలకు తిరిగి ప్రారంభమవుతుందని భావించినా మరోసారి చినుకులు పడడంతో మ్యాచ్‌ను వాయిదా వేస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. రేపు(సోమవారం) మధ్యాహ్నం 3 గంటలకు ఎక్కడైతే మ్యాచ్ ఆగిందో అక్కడి నుంచి తిరిగి ప్రారంభం అవుతుంది. వర్షం అంతరాయం లేకపోతే పూర్తిగా మ్యాచ్‌ను ఆస్వాదించవచ్చు.
ఓపెనర్లుగా వచ్చిన శుభ్‌మన్‌గిల్(58), రోహిత్ శర్మ(56) అర్థశతకాలు బాది భారత్‌కు శుభారంభాన్ని ఇచ్చారు. 121 పరుగుల భాగస్వామ్యంతో భారత స్కోరును పరుగులు పెట్టించారు. అయితే అర్థశతకాలు పూర్తి చేసుకున్న తర్వాత ఇద్దరూ వెంటవెంటనే ఔటయ్యారు. రోహిత్ శర్మ పాక్ బౌలర్ షాదాబ్ ఖాన్ వేసిన 16.4 ఓవర్‌కు భారీ షాట్ ఆడబోయి ఫహీమ్ అష్రాఫ్‌కు చిక్కాడు. 121 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్‌ను కోల్పోయింది. 18వ ఓవర్‌లో శుభమన్ గిల్(58) ఔటయ్యాడు. షాహీన్ అఫ్రీది వేసిన ఐదో బంతికి అఘా సల్మాన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!