ఆసియా కప్ 2023 ఫైనల్‌లో భారత్ చారిత్రాత్మక విజయం సాధించినందుకు పలువురు క్రికెట్ దిగ్గజాలు అభినందనల వర్షం కురిపిస్తున్నారు. సచిన్ టెండూల్కర్ నుంచి యువరాజ్ సింగ్ వరకు పలువురు క్రికెటర్లు అభినందనలు తెలిపారు.
2023 ఆసియా కప్ ఫైనల్‌లో టీమిండియా శ్రీలంకను సులువుగా ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. దీంతో భారత్ 8వ సారి ఆసియా కప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు కేవలం 50 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం భారత జట్టు కేవలం 6.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని సులభంగా ఛేదించింది.
రేపు శ్రీలంక రాజధాని కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగే టైటిల్ మ్యాచ్‌లో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంకతో తలపడనుంది. శ్రీలంక కంటే భారత్ జట్టు చాలా బలంగా ఉన్న.. లంకేయుల జట్టులో ఓ ఆటగాడు టీమిండియాను టెన్షన్‌కి గురిచేస్తున్నాడు. ఇంతకుముందు జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో ఈ రెండు జట్లు తలపడినప్పుడు.. ఈ ఆటగాడు భారత జట్టులో సగం మందిని పెవిలియన్‌కు పంపించాడు.
ఆసియా కప్ 2023లో సూపర్-4 దశ చివరి మ్యాచ్ లో భాగంగా.. కాసేపట్లో భారత్ - బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది.
శ్రీలంక రాజధాని కొలంబోలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో శ్రీలంక-పాకిస్తాన్ మధ్య జరగాల్సిన కీలకమైన సూపర్-4 మ్యాచ్ మరింత ఆలస్యం కానుంది. ఆసియా కప్ 2023లో భాగంగా.. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగాల్సి ఉండగా.. ఇంకా టాస్ కూడా వేయలేదు. అయితే ఒకవేళ వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దైతే.. శ్రీలంక ఫైనల్ కు చేరుకుని నవంబర్ 17న ఇదే స్టేడియంలో భారత్‌తో తలపడనుంది.
Shubman Gill: భారత ఓపెనర్, స్టార్ బ్యాటర్ గా ఎదుగుతున్న శుభ్‌మాన్ గిల్ పాకిస్తాన్ తో జరిగిన మ్యాచులో సత్తా చాటాడు. షాహీన్ అఫ్రిది, రౌఫ్, షాషీన్ షా వంటి పేస్ బలగాన్ని చితక్కొట్టాడు. రోహిత్ శర్మతో కలిసి కీలకమైన భాగస్వామ్యాన్ని నిర్మించాడు
Dunith Wellalage: శ్రీలంక న్యూ సెన్సేషన్ దునిత్ వెల్లలాగే, భారత్ తో మ్యాచు ఓడిపోయినా అందరి మనుసుల్ని మాత్రం గెలుచుకున్నాడు. 20 ఏళ్ల ఈ కుర్రాడు ఇటు బౌలింగ్ లోనూ, అటు బ్యాటింగ్ లోనూ ఇండియా టీంకు ముచ్చెమటలు పట్టించాడు.
కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారింది. నిన్నటిలానే పలుమార్లు ఇబ్బంది పెట్టిన వరుణుడు.. ఇవాళ కూడా నేనున్నానంటూ వచ్చేశాడు. దీంతో భారత్ ఇన్నింగ్స్ 47 ఓవర్లు పూర్తయ్యాక వర్షం పడుతుండటంతో ఆటను నిలిపివేశారు. ప్రస్తుతం భారత్ 9 వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది.
నిన్న పాకిస్తాన్ తో మ్యాచ్ గెలిచి మంచి జోరు మీదున్న టీమిండియా.. శ్రీలంకతో ఆరంభంలో మంచి ప్రారంభాన్ని అందించారు. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. కెప్టెన్ రోహిత్ శర్మ అర్థసెంచరీ సాధించగా.. మరో ఓపెనర్ గిల్(19) పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ కూడా కేవలం (3) పరుగులు చేసి ఔటయ్యాడు.
ఆసియా కప్ 2023లో భాగంగా.. టీమిండియా బ్యాట్స్ మెన్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ సెంచరీలతో అదరగొట్టారు. కేఎల్ రాహుల్ 100 బంతుల్లో ఎదుర్కొని సెంచరీ చేయగా.. కోహ్లీ 84 బంతుల్లో 100 పరుగులు చేశాడు.