IND vs PAK: శ్రీలంక రాజధాని కొలంబోలో భారీ వర్షం పడుతుంది. దీంతో భారత్-పాక్ మ్యాచ్ మరింత ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఈ ఉదయం వాతావరణం పొడిగా ఉన్నప్పటికీ.. ఇవాళ భారత్-పాకిస్తాన్ మ్యాచ్ పూర్తవుతుందని అందరూ భావించారు. కానీ ఉన్నట్టుంది ఒక్కసారిగా వాతావరణం తారుమారై వర్షం కురిసింది. కొలంబోలో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తుంది. దీంతో గ్రౌండ్ మొత్తం కవర్లతో కప్పివేశారు. ఇలాంటి పరిస్థితుల్లో 50-50 ఓవర్ల మ్యాచ్ మొత్తం ఆడుతారా లేదా అనే సందేహం నెలకొంది.
Read Also: Jigarthanda Double X: లారెన్స్ ఏంటి ఇంత భయంకరంగా ఉన్నాడు.. జిగర్ తండా డబుల్ ఎక్స్ టీజర్ చూశారా?
మ్యాచ్ ప్రారంభమవుతుందనే 90 నిమిషాల ముందు భారీ వర్షం కురిసింది. మధ్యలో ఓసారి వర్షం ఆగిపోవడంతో సిబ్బంది కవర్లు తొలగించడంతో మ్యాచ్ మొదలవుతుందన్న ఆశలు మొలకెత్తాయి. అయితే ఆ ఆనందం కాసేపే అయింది. మళ్లీ వర్షం మొదలవడంతో మైదానాన్ని పూర్తిగా కవర్లతో కప్పేశారు. దీంతో పిచ్ ను పూర్తిగా కవర్లతో కప్పేశారు. ఈ రోజు భారత్-పాక్ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా.. వర్షం పడుతుండటంతో ఆటకు అంతరాయం ఏర్పడింది. అయితే మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుందనేది చెప్పలేం.
Read Also: MLA Krishnamohan Reddy: హైకోర్టును తప్పుదోవ పట్టించిన డీకే అరుణకు శిక్ష తప్పదు
భారత్-పాక్ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉంచడం గమనార్హం. నిన్న కేవలం 24.1 ఓవర్లు మాత్రమే ఆడగలిగారు. వర్షం వచ్చే సమయానికి టీమిండియా 24.1 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (8), కేఎల్ రాహుల్ (17) పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకు ముందు రోహిత్ శర్మ 56 పరుగులు చేసి ఔట్ కాగా, శుభ్‌మన్ గిల్ 58 పరుగుల వద్ద ఔటయ్యాడు.