IND vs PAK: ఆసియా కప్ లో భాగంగా సూపర్-4లో భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. అనుకున్న సమయం కంటే గంటకు పైగా ఆలస్యంగా ప్రారంభమైంది. భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్.. వర్షం పడటంతో ఆటకు అంతరాయం ఏర్పడింది. నిన్న కూడా వర్షం పడటంతో ఆటను రిజర్వ్ డే కు ప్రకటించారు. నిన్న 24.1 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన టీమిండియా.. రెండో రోజు అక్కడి నుంచే బ్యాటింగ్ మొదలెట్టింది. నిన్న మ్యాచ్ నిలిచిపోయే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసిన టీమిండియా.. ఇవాళ కూడా దూకుడుగా ఆటను ప్రారంభించారు.
Read Also: Himanta Biswa Sharma: గాంధీ కుటుంబం దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కృషి చేస్తుంది
ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ(22), కేఎల్ రాహుల్(42) ఉన్నారు. మరోవైపు ఈ మ్యాచ్ కు వరుణుడు అడ్డుపడేలా కనిపిస్తోంది. వర్షం తగ్గినప్పటికీ.. వాతావారణం మాత్రం చల్లగా ఉంది. అయితే క్రికెట్ అభిమానులు మాత్రం నిన్నటి నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాయాదుల పోరు అంటే టీవీకి అతుక్కుపోతారు. అలాంటిది ఇలా వరుణుడు మధ్యమధ్యలో వచ్చి ఇబ్బందికి గురిచేస్తుండటంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. చూడాలి మరీ మ్యాచ్ సజావుగా నడుస్తుందో లేదో..