What happens if Asia Cup 2023 Super-4 Matches in Colombo are washed out: ఆసియా కప్ 2023లో గ్రూప్ దశ ముగిసి.. సూపర్-4 సాగుతోంది. సూపర్-4 తొలి మ్యాచ్ లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో జరగ్గా.. బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్ విజయం సాధించింది. ఇక సూపర్-4లో మిగిలిన 5 మ్యాచ్‌లు శ్రీలంకలోని కోలంబోలో జరగనున్నాయి. సూపర్-4లో భారత్, శ్రీలంక జట్లు మూడేసి మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా.. పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు మాత్రం రెండేసి మ్యాచ్‌లను ఆడుతాయి.…
Babar Azam Breaks Virat Kohli ODI Record in Asia Cup 2023: పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. వన్డే ఫార్మాట్‌లో తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 2000 పరుగులు పూర్తి చేసిన తొలి కెప్టెన్‌గా నిలిచాడు. ఆసియా కప్ 2023లో భాగంగా బుధవారం లాహోర్‌లో బంగ్లాదేశ్‌పై 22 బంతుల్లో 17 పరుగులు చేసిన బాబర్ ఈ రికార్డు తన పేరుపై లిఖించుకున్నాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డుని…
PCB demands compensation from ACC over Asia Cup Loss: ఆసియా కప్ 2023 విషయంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ), పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మధ్య గొడవ ఇంకా సమసిపోలేదు. శ్రీలంకలో వర్షాల వల్ల ఆసియా కప్ పెద్దగా సక్సెస్ కాక తాము నష్టపోతున్నామని, తమకు ఏసీసీ నష్టపరిహారం చెల్లించాలని పీసీబీ డిమాండ్ చేస్తోందట. తమకు పరిహారం కావాలంటూ పీసీబీ చీఫ్ జకా అష్రాఫ్.. ఏసీసీ అధ్యక్షుడు జై షాకు మెయిల్ రాశారట.…
India Batting Coach Makes BIG Statement Ahead Of IND Vs PAK Asia Cup 2023 Super Four Match: ఆసియా కప్ 2023 సూపర్-4లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు సత్తాచాటుతారని భారత్ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ధీమా వ్యక్తం చేశారు. భారత ఆటగాళ్లకు పాక్ పేస్ దళాన్ని ఎదుర్కొనే సత్తా ఉందని పేర్కొన్నాడు. ఆసియా కప్ లీగ్ దశలో వర్షం కారణంగా రద్దయిన మ్యాచ్‌లో పాక్ పేసర్ల…
BCCI President Roger Binny Said We received very good hospitality in Pakistan: పాకిస్థాన్‌లో లభించిన ఆప్యాయత, స్నేహపూర్వక ఆదరణ తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ తెలిపాడు. రెండు దేశాల మధ్య క్రికెట్ ఆట వారధిగా నిలుస్తుందని బీసీసీఐ బోర్డు వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ఆశాభావం వ్యక్తం చేశారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆహ్వానం మేరకు ఆసియా కప్ 2023 మ్యాచ్‌లను వీక్షించిన తర్వాత బిన్నీ,…
లాహోర్‌లోని గడాఫీ స్టేడియం వేదికగా బుధవారం జరుగుతున్న ఆసియా కప్‌లోని మొదటి సూపర్4 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను పాకిస్థాన్ 193 పరుగులకే కట్టడి చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా జట్టు 193 పరుగులకే ఆలౌట్ కావడం గమనార్హం.
ఆసియా కప్ 2023 నుంచి ఆఫ్ఘనిస్తాన్ జట్టు నిష్క్రమించింది. ఆ జట్టు కప్ నుంచి నిష్క్రమించిన ఒక రోజు తర్వాత ఆఫ్ఘన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ట్విట్టర్ వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఆసియాకప్‌లో భాగంగా శ్రీలంకతో లాహోర్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌ను దురదృష్టం ఓడించింది.
Shubman Gill moved to No 3 in ODI Rankings with 750 Rating: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత యువ ఆటగాళ్లు శుభ్‌మాన్ గిల్, ఇషాన్ కిషన్ కెరీర్ హై రేటింగ్‌కు చేరుకున్నారు. ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో గిల్ మూడో స్థానంలో ఉన్నాడు. భారత ఓపెనర్ ఖాతాలో 750 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఆసియా కప్ 2023లో నేపాల్‌పై తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గిల్ అజేయంగా 67 పరుగులు చేసిన…
Asia Cup 2023 Super-4, Final Matches to stay in Colombo: కొలంబోలో భారీ వర్షాల కారణంగా ఆసియా కప్ 2023 ‘సూపర్-4’ మ్యాచ్‌లు, ఫైనల్ వేదికను మార్చే అవకాశం ఉందని జరిగిన చర్చకు తెర పడింది. ముందుగా నిర్ణయించిన ప్రకారమే.. సూపర్ 4 మ్యాచ్‌లు, ఫైనల్ యధాతథంగా కొలంబోలోనే జరుగనున్నాయి. కొలంబోలో వాతావరణం మెరుగయ్యే సూచనలు కనిపిస్తుండటంతో.. వేదికను మార్చకూడదని మంగళవారం ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) నిర్ణయించింది. భారీ వర్షాల కారణంగా సూపర్…
SunilGavaskar feels Ishan Kishan should continue in India playing XI: ఆసియా కప్ 2023లో నేపాల్‌పై ఘన విజయం సాధించిన భారత్.. సూపర్-4కు దూసుకెళ్లింది. పాక్ మ్యాచ్‌లో తడబడిన భారత టాప్ ఆర్డర్.. నేపాల్‌పై చెలరేగింది. అయినా కూడా తుది జట్టు ఎంపికపై మాత్రం ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఫిట్‌నెస్ టెస్ట్ పాస్ అయిన స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. ఆసియా కప్‌కు అందుబాటులోకి వచ్చాడు. వన్డే ప్రపంచకప్ 2023 కోసం ప్రకటించిన…