విజయనగరంలో బాబాయ్ వర్సెస్ అమ్మాయిలా రాజకీయం నడుస్తోంది. సంచయిత గజపతి పై వ్యాఖ్యలు చేశారు మాజీ కేంద్రమంత్రి ప్రస్తుత సింహాచలం దేవస్థానం చైర్మన్ అశోక్ గజపతిరాజు. సంచయిత గజపతిరాజుని ఇల్లీగల్ చైర్మన్ గా వ్యాఖ్యానించారు అశోక్ గజపతి. ఈరోజు జరిగిన సమావేశంలో 12 అంశాలకు గాను 11 అంశాలను ఆమోదించామని అశోక్ గజపతిరాజు తెలిపారు. ఒక అంశాన్ని పరిశీలించి చర్చించాలన్నారు. ప్రతి ఒక్కరూ ఆ సింహాద్రి అప్పన్నకు సేవ చేయాలని ఆయన కోరారు. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్‌గా…
ఏపీలో రాజకీయాలు ఎప్పుడూ హాట్ గానే వుంటాయి. అందులోనూ విజయనగరంలో పూసపాటి వారి ఇంట రాజకీయాల సంగతి అయితే చెప్పాల్సిన పనిలేదు. విజయనగరంలో ప్రతి ఏడాది నిర్వహించే పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి తనను ఆహ్వానించలేదని చెబుతున్నారు మాన్సాస్ ట్రస్ట్ మాజీ చైర్ పర్సన్ సంచయిత. ఈమేరకు ఆమె ట్విట్టర్ లో స్పందించారు. ఈ సిరిమానోత్సవం రోజున పైడితల్లి అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని అని అభిలషించారు. మన హృదయం నిర్మలంగా ఉంటే అమ్మవారి కటాక్షం ఎప్పుడూ ఉంటుందని…
సిరిమాను సంబరానికి అంతా సిద్ధమయింది, ఉత్తరాంధ్ర కల్పవల్లి పూసపాటి వంశీయుల ఇలవేల్పు అయిన పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి విజయనగరం జిల్లా ముస్తాబైంది. కరోనా కారణంగా పైడిమాంబ ఉత్సవాలను గతంలోలా కాకుండా చాలా సాదాసీదాగా జరపనున్నారు. రెండో ఏడాదీ భక్తులు లేకుండానే అమ్మవారి ఉత్సవాలు జరగనున్నాయి. అమ్మవారిని కనులారా వీక్షించే అవకాశం లేకుండా పోయిందని భక్తులు వాపోతున్నారు. ఇదిలా వుంటే.. సిరిమాను ఊరేగింపునకు సర్వం సిద్ధం అయింది. కోట బురుజుపై చేరుకున్నారు రాజవంశీయులు అశోక్ గజపతి రాజు కుటుంబసభ్యులు.…
మాన్సాస్ ట్రస్ట్, ఇతర విషయాల్లో టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, ఏపీ ప్రభుత్వం మధ్య వివాదం నడుస్తూనే ఉంది… ఇక, మరోసారి అశోక్ గజపతిరాజుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. సంచయిత గజపతిపై అశోక్ గజపతిరాజు వ్యాఖ్యలు చాలా అనాగరికం… అలాంటి అనాగరికుడుని రాజుగా ఎలా గుర్తిస్తామన్న ఆయన.. కూలింగ్ గ్లాసులలో లోకాన్ని చూసే వాడు ప్రజా సమస్యలు ఎలా తెలుసు కుంటారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పుణ్యమా…