Asaduddin Owaisi: కేంద్రం ఇటీవల జనాభా లెక్కలతో పాటే ‘‘కులగణన’’ చేస్తామని ప్రకటించింది. 2024 ఎన్నికల ముందు నుంచి కాంగ్రెస్‌తో సహా పలు ఇండీ కూటమి పార్టీలు కులగణనను డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ-ఎన్డీయే సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ కులగణనపై ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నల్ని లేవనెత్తారు. కులగణనకు కేంద్రం ఒక టైమ్ లైన్ ఉండాలని కోరారు.
Read Also: Greg Chappell: సూర్యవంశీకి సచిన్‌లాగా సపోర్ట్ చేయండి.. లేదంటే వాళ్ల గతే పడుతుంది?
‘‘బీజేపీ ఎన్డీయే ప్రభుత్వానికి కులగణనకు టైమ్‌లైన్ ప్రకటించాలి. ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, ఎప్పుడు అమలు అవుతుంది అనేది చెప్పాలి. 2029 పార్లమెంట్ ఎన్నికల ముందు ఇది జరుగుతుందా..?’’ అని ఓవైసీ ప్రశ్నించారు. కులగణన ప్రాముఖ్యతను వివరిస్తూ, అమెరికాలో ఆఫ్రికన్ అమెరికన్లు, యూదులు, చైనీయాలు సహా అనేక అణగారిన వర్గాలపై నిశ్చయాత్మక చర్యలు తీసుకోవడం వల్లే అమెరికా శక్తివంతంగా ఎదగడానికి వీలు కలిగిందని అన్నారు. కులగణ వివిధ కులాల మధ్య భూయాజమాన్యం ఇతర ప్రయోజనాలను వెల్లడిస్తుందని, ముస్లింలో కులగణన పస్మాండ ముస్లింల వాస్తవ పరిస్థితిని తెలియజేస్తుందని చెప్పారు.
దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలని ఎంఐఎం 2021 ననుంచి డిమాండ్ చేస్తోందని, చివరిసారిగా కుల సర్వే 1931లో జరిగిందని చెప్పారు. కులగణన వల్ల ఎవరి వద్ద ఎంత భూమి ఉంది, ఎవరి వద్ద భూమి లేదు అనేది తెలుస్తుందని, ఇది చాలా అవసరమని అన్నారు.