MP Asaduddin: కాంగ్రెస్ అస్తిత్వం కోల్పోతోందని, ఆ పార్టీని అందరూ వీడుతున్నారని, కాంగ్రెస్ లో ఓవైసీ లాంటి మొగాడెవరూ లేరా? అంటూ AIMIM అధ్యక్షుడు, MP అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అసదుద్దీన్ మాట్లాడుతూ.. కాంగ్రేస్ అధ్యక్షుడు రేవంత్ ప్రతి నియోజకవర్గంలో రాం మందిరాలు నిర్మిస్తామన్నారని తెలిపారు. హజ్ కు వెళ్ళే వాళ్ళపై కాంగ్రేస్ హయాంలోనే రాళ్ళు రువ్వారని గుర్తు చేశారు. నాన్ సెక్యులర్ BJP మజ్లిస్ పై ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. అమిత్ షా ఇక్కడకొచ్చి కారు స్టీరింగ్ మజ్లిస్ చేతిలో ఉందని ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణాలో BJP మజ్లిస్ పేరు జపంచేయటమే పనిగా పెట్టుకొందని మండిపడ్డారు. కొత్త సెక్రెటేరియట్ ఓవైసీ ఆనందం కోసమేనట అంటూ వ్యంగాస్త్రం వేశారు. గుజరాత్ లోని ఓ హనుమాన్ మందిరం నమూనా ఆధారంగానే TS కొత్త సెక్రెటేరియట్ నిర్మించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. నా ఆనందం కేవలం మసీద్ లోనే ఉందని అన్నారు.
మసీదు కూల్చిన చోట కొత్తది నిర్మించలేదు కానీ సెక్రెటేరియట్ పూర్తైంది. గచ్చిబౌలీలో ఇస్లామిక్ సెంటర్ ఇంతవరకు ఏర్పాటుచేయలేదన్నారు. కానీ బ్రాహ్మణ్ సదన్ ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తైనాయని ఎద్దేవ చేశారు. బ్రాహ్మణ్ సదన్ ప్రారంభోత్సవానికి దక్షిణ భారతంలోని అన్ని ప్రముఖ మఠాధిపతులను ఆహ్వానించారని ఆరోపణలు గుప్పించారు. 2500 కోట్ల నిధులు TS లో మందిరాలకొరకు ఖర్చు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులకు హిందూ దేవతల పేర్లు ఉన్నాయో అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణా BJP నేతలకు దమ్ముంటే వీటిపై మాట్లాడండి అంటూ సవాల్ చేశారు. నా పేరు చెప్పుకొని BJP కడుపు నింపుకోవాలనుకుంటే నాకు అభ్యంతరంలేదని వ్యంగాస్త్రం వేశారు. అమిత్ షా కు తెలుసు ఒవైసీ ఇస్లాం ధార్మికుల సేవకుడని.. అందుకే ఆయనకు భయమని అన్నారు. మజ్లిస్ ను బలహీన పరిచే శక్తి దేశంలో ఎవరికీ లేదని అన్నారు. సెక్రెటేరియట్ పై BJP జెండా ఎగరబోదని తెలిపారు.
Read also: Reels makers: రీల్స్ చేసే వారికి తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్.. వివరాలు ఇవిగో
అమిత్ షా చెప్పులు మోసే BJP నాయకులు కూడా మజ్లిస్ పై మాట్లాడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లీంల అభివృద్ది నిధులపై ఏడ్చేవారు వారి తండ్రి, తాతల ఆస్తులిస్తున్నారా? అంటూ మండిపడ్డారు. మేముంటేనే ఎవరైనా ముఖ్యమంత్రి కాగలరు గుర్తుంచుకొండి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో మజ్లిస్ ఎన్ని స్థానాల్లో పోటీ చేయనుందో త్వరలో వెల్లడిస్తానని చెప్పుకొచ్చారు. ఆదిలాబాద్ లో ఉర్దూ మీడియం ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ ఎందుకు ఏర్పాటుచేయలేదు? అని ప్రశ్నించారు. ఖుర్షీద్ నగర్ లో షాదీఖానా కొరకు 2 కోట్ల నిధులు మంజూరైనప్పటికీ నిర్మాణం కాలేదని మండిపడ్డారు. ఆదిలాబాద్ రిమ్స్ లో ఉద్యోగాలకొరకు లక్ష రూపాయలు లంచం తీసుకుంటున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే కేవలం మున్నూరుకాపులకేనా లేక అందరికీ ఉద్యోగాలిప్పించే ఉద్దేశమందా.? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇచ్చోడలో ఉర్దూ కాలేజ్ ఏర్పడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టీరింగ్ నా చేతిలో ఉందంటున్నారు.. దురదృష్టవశాత్తూ యాక్సిండెంట్ చేస్తానేమో అంటూ వ్యంగాస్త్రం వేశారు.
కేవలం కల్లబొల్లి మాటలతో మా నిరుద్యోగ యువత కడుపు నిండదని అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ స్పందించాలని కోరారు. ఆదిలాబాద్ లో 60 వేల ముస్లీంల ఓట్లున్నాయిని గుర్తు చేశారు. మా సమస్యలు తీరిస్తే సరి, లేదంటే వచ్చే ఎన్నికల్లో మేం మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితులుండవని హెచ్చరించారు. IT హబ్ ఏర్పాటుచేశారు.. మా పిల్లలుకూడా నిరుద్యోగులున్నారు.. వారికీ ఉద్యోగాలు రావాలని చెప్పారు. లోక్ సభలో ప్రధాని వెంట పదుల సంఖ్యలో హిందూ పూజారులు ఉన్నారని తెలిపారు. ముస్లీం, క్రైస్తవ, సిఖ్ ధర్మ ప్రముఖులు కూడా ఉండాల్సింది అని తెలిపారు. ఇది సెక్యులరిజం కు విరుధ్దమన్నారు. కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం ప్రజాస్వామ్యాన్ని ప్రతిబింబించలేదని అన్నారు. రాజరిక రాజ్యాభిషేకాన్ని ప్రతిబింబించిందని అన్నారు. ఆంగ్లేయులతో టిప్పు సుల్తాన్ కూడా పోరాడారు అని గుర్తు చేశారు. 28 మే రోజున హైదరాబాద్ మక్కా మసీద్ మౌల్వీ తుర్రేబాజ్ ఖాన్ కాలాపానీ జైలుకెళ్ళిన తొట్టతొలి తెలంగాణా బిడ్డ అని అన్నారు.
పాకిస్తాన్ ప్రేమికులు అక్కడికెళ్ళారు, ఇక్కడున్నవారందరూ దేశ ప్రేమికులే అని ఓవైసీ తెలిపారు. కేరళ స్టొరీ సినిమా పై ద కేరళా స్టోరీ సినిమా ను ప్రధాని మోదీ అభినందించారు. మోదీ ని మించిన నటులెవరూ లేరు.. 9 ఏళ్ళృగా అద్భుతంగా నటిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గో రక్షకుల పేర దౌర్జన్యాలు చేస్తున్నవారు రాక్షసులు అని మండిపడ్డారు. మున్నూరుకాపు, ముదిరాజ్ లు పార్టీని బలపరుస్తున్నందుకు BJP వారు సంబరపడ్తున్నారు, చూద్దాం వారి సంబలమెన్నిరోజులో అంటూ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్, తెలంగాణా శాంతి మాకు ముఖ్యమన్నారు. నేను మాత్రమే కాదు నా వారందర్నీ ఉన్నతికి తీసుకెళ్ళటమే మజ్లిస్ లక్ష్యమన్నారు. ముస్లీం యువత విద్యాధికులు కండి, ప్రజా ప్రతినిధులు గా మారండి అంటూ పిలుపునిచ్చారు. మా పేదరికాన్ని తక్కువ అంచనా వేయొద్దని, ఇస్లాం చరిత్రలో విజేయులందరూ పేదవారే అనేది మరువద్దని ఓవైసీ తెలిపారు. మసీదులను బాగుంచండి, ఉల్మాలను గౌరవించండి అంటూ అన్నారు. ఆదిలాబాద్ లో మజ్లిస్ ను బలపర్చండి అన్నారు. తెలంగాణా వ్యాప్తంగా మా జల్సా(బహిరంగసభ) లు ఇక పై కొనసాగుతూనే ఉంటాయని ఓవైసీ తెలిపారు.
Top Headlines @ 9 AM: టాప్ న్యూస్