Asaduddin Owaisi: “మీ అన్న అమేథీలో ఓడిపోయారు”.. ప్రియాంకాగాంధీపై ఓవైసీ ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: కాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం ప్రియాంకాగా గాంధీ మాట్లాడుతూ.. కీలక నియోజకవర్గాల్లో ఓట్లు చీల్చేందుకు ఎంఐఎం, బీజేపీకి సహకరిస్తోందని ఆరోపించారు. అయితే, ఈ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ 2019లో అమేథీ నియోజకవర్గంలో ఓడిపోవడాన్ని ప్రస్తావించారు. ఆ ఎన్నికల్లో కేంద్రమంత్రి, బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ ఓడిపోయారు.
అమేథీలో స్మృతీ ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ ఓడిపోయినప్పుడు ఆ నియోజకవర్గంలో తన పార్టీ కానీ, తాను కానీ పోటీ చేయలేదనే విషయాన్ని ఓవైసీ ఎత్తి చూపారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేతలో పాల్గొన్న మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే శివసేనతో లౌకిక రహిత పొత్తులు పెట్టుకున్నందుకు కాంగ్రెస్‌ని విమర్శించారు. ‘‘ ప్రియాంకా గాంధీ వాద్రా, మీ అన్న అమేథీలో ఓడిపోయారు. నేను వచ్చి అక్కడ పోరాడానా..? మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రేతో మీకు పొత్తు ఉంది. అతను లౌకికవాదా..? ఇదే శివసేన కార్యకర్తలు డిసెంబర్ 6న బాబ్రీని ధ్వంసం చేశారు. మీరు వారితో ఉన్నారు’’ అని అసదుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
Read Also: Kejriwal: కేజ్రీవాల్ బెయిల్‌కు కండీషన్స్ అప్లై.. సుప్రీం ఏం చెప్పిందంటే..!
మీరు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)తో పొత్తు పెట్టుకున్నారు. ఇదే ఆప్ జమ్మూ కాశ్మీ్ర్‌లో ఆర్టికల్ 370ని తొలగించడంలో బీజేపీకి సాయం చేసింది. మీరు మమ్మల్ని బీజేపీ B-టీమ్ అని పిలుస్తారా..? అని అసద్ ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో మీరు బీజేపీపై పోటీ చేసి 92 శాతం స్థానాల్లో ఓడిపోయారు. ఈ సారి 300 స్థానాల్లో పోటీ చేస్తున్నారు, ఈ సారి ఎన్ని గెలుస్తారో చెప్పండి అంటూ ప్రశ్నించారు.
యూపీలోని రాయ్‌బరేలీలో ప్రియాంకా గాంధీ ప్రచారం చేస్తూ బీజేపీతో కలిసి ఎంఐఎం పనిచేస్తుందని ఆరోపించిన నేపథ్యంలో అసదుద్దీన్ నుంచి ఈ ప్రతిస్పందన వచ్చింది. ‘‘ఓవైసీ నేరుగా బీజేపీతో కలిసి పనిచేస్తున్నారు. ఇతర పార్టీలను వెనక్కి నెట్టడానికి బీజేపీని గెలిపించేందుకు అతను పనిచేస్తున్నాడు. ఇది తెలంగాణ ఎన్నికల్లో స్పష్టంగా ఉంది’’ అని ఆమె ఆరోపించారు. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు మే 13న ఎన్నికలు జరగబోతున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!