Owaisi Counters: పోలీసులు 15 నిమిషాలు పక్కకు జరిగితే తామేం చేయగలమో చూపిస్తామని అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ చేసిన కామెంట్స్ తెలంగాణ పాలిటిక్స్‌లో మరోసారి దుమారం రేపుతున్నాయి. 15 నిమిషాలు పోలీసులు తప్పుకుంటే మేమేంటో చూపిస్తామని అక్బరుద్దీన్ చెబుతున్నాడు. అక్బరుద్దీన్ కు నేను సవాల్ విసురుతున్నా 15 నిమిషాలు ఎందుకు.. మాకైతే 15 సెకన్లు చాలు అన్నారు. ఆ 15 సెకన్లలోనే మీరు ఎక్కడి నుంచి వచ్చారో.. ఎక్కడికి వెళ్లిపోతారో మీకే తెలియదంటూ నవనీత్ రాణా హైదరాబాద్‌లో ప్రచారం సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే నవనీత్ కౌర్ మాటలకు ఏఐఎంఐం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.
Read also: Air India Express: ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ ఉద్యోగులపై వేటు..
ఇవాళ ఆయన మాట్లాడుతూ.. 15 సెకన్లు కాదు గంట సమయం తీసుకోండి.. ముస్లింలను ఏం చేస్తారో చేయండని ఎంఐఎం చీఫ్ సవాల్ విసిరారు. అధికారమంతా మీ దగ్గరే ఉంది.. ఎక్కడికి రమ్మంటే తాము అక్కడికి వస్తామన్నారు. దీంతో బీజేపీ, ఎంఐఎం మధ్య మాటల యుద్ధం దుమారం రేపుతుంది. కాగా.. నవనీత్ రాణా ప్రకటనపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని AIMIM డిమాండ్ చేసింది. ఎన్నికల సంఘం నిబంధనలను ఉల్లంఘించేలా బీజేపీ నేతలు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని, నవనీత్ రాణా ఈ ప్రకటనపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని పార్టీ అధికార ప్రతినిధి వారిస్ పఠాన్ అన్నారు.
Read also: Pakistan : పాకిస్థాన్‌లో మరోసారి ఉగ్రవాదుల దాడి.. ఏడుగురు మృతి
కాగా.. 2012లో అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన ప్రకటన చేశారు. 15 నిమిషాల పాటు పోలీసులను తొలగించండి, ఎవరికి ఎంత అధికారం ఉందో చెబుతామని ఒవైసీ అన్నారు. అయితే ఈ కేసులో కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించింది. 15 నిమిషాల్లో పోలీసులను తొలగించాలని అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తర్వాత స్వయంగా లొంగిపోయి జైలుకు వెళ్లారు. తర్వాత బెయిల్ వచ్చింది. అయితే ఇన్నాళ్లు కోర్టులో తన ప్రసంగం కోసం పోరాడి నిర్దోషిగా విడుదలైన విషయం తెలిసిందే..
Barron Trump: డొనాల్డ్ ట్రంప్ చిన్న కుమారుడి పొలిటికల్ ఎంట్రీ