ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని బహిరంగంగా ప్రశంసించారు. ఒక వైపు, కేజ్రీవాల్ నితిన్ గడ్కరీని మెచ్చుకుంటూ.. మరోవైపు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్వచ్ఛమైన సిద్ధాంతం గల నాయకుడని అభివర్ణించారు. కాంగ్రెస్, బీజేపీలు అవినీతిపరులని తరచూ చెప్పే కేజ్రీవాల్ ఇతర పార్టీల నేతలను ఈ విధంగా పొగిడటం చాలా అరుదు.
త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. అందంగా అలంకరించిన గుర్రంపై వరుడు లేని వీడియోను ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ.. బీజేపీ ఇంకా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదని విమర్శించింది.
Arvind Kejriwal: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో ఒక్కసారిగా అక్కడి రాజకీయ వాతావరణం మారిపోయింది. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ, మరోసారి అధికారం చేపట్టాలని ఆప్, సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయాలు హీటెక్కాయి. త్వరలో జరగనున్న అసెంబ్లీ పోల్స్‌కి అన్ని పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ ఆప్.. అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. తాజాగా బీజేపీ 29 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది.
Arvind Kejriwal: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళా ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరో హామీ ఇచ్చారు. ఢిల్లీలో మరోసారి అధికారంలోకి రాగానే మంచి నీటి బిల్లులను మాఫీ చేస్తామని తెలిపారు.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించినట్లు కనిపిస్తోంది. ఈ రోజు ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌పై విరుచుకుపడ్డారు. ఆప్ అన్ని రంగాల్లో అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి నివాసం కోసం అరవింద్ కేజ్రీవాల్ ‘‘శీష్ మహల్’’ని విలాసవంతంగా నిర్మించారు.
BJP- AAP Poster War: దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఓటర్లను ఆకర్షించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ వినూత్న ప్రచారానికి తెర లేపాయి.
AAP vs BJP: న్యూ ఇయర్ రోజు ఆప్, బీజేపీ మధ్య లేఖల యుద్ధం సాగుతోంది. ముందుగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ బీజేపీని ఉద్దేశిస్తూ, ఆర్ఎస్ఎస్కి లేఖ రాయడంతో వివాదం మొదలైంది. బీజేపీ చర్యలను ఆర్ఎస్ఎస్ సపోర్ట్ చేస్తుందా..? అంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కి లేక రాశారు.
Arvind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌కు లేఖ రాశారు. కేజ్రీవాల్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్‌కు లేఖ ద్వారా పలు ప్రశ్నలు సంధించారు.
దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. కొత్త ఏడాది ఆరంభంలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ప్రధాన పార్టీలైన ఆప్, కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా తలపడుతున్నాయి.