BJP: ఢిల్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో, అధికార పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)పై బీజేపీ దాడి ప్రారంభించింది. ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ టార్గెట్‌గా ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఆలయ పూజారులకు, గురుద్వారా గ్రాంథీలకు ప్రతీ నెలా రూ. 18,000 ఇస్తానని కేజ్రీవాల్ హామీ ఇచ్చిన తర్వాత.. ‘‘ ఎన్నికల హిందువు’’ అంటూ బీజేపీ విమర్శలు ప్రారంభించింది.
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి ఆప్ ప్రభుత్వం వర్సెస్ లెఫ్టినెంట్ గవర్నర్ వ్యవహారం మరోసారి హీటెక్కుతోంది. ఎన్నికల ముంగిట ఘర్షణ వాతావరణం నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
AAP: ఇండియా కూటమిలో ప్రధాన పార్టీలైన ఆప్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు మరికొన్ని నెలల్లో జరుగునున్న తరుణంలో ఇరు పార్టీల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి.
ఢిల్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కాంగ్రెస్ మధ్య పోరు తెరపైకి వచ్చింది. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను దేశ వ్యతిరేకి అని అజయ్ మాకెన్ అనడంపై ఆప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 24 గంటల్లోగా అజయ్ మాకెన్‌పై చర్యలు తీసుకోవాలని ఆప్ డిమాండ్ చేసింది.
Arvind Kejriwal: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తన అభ్యర్థుల్ని ప్రకటించింది. బీజేపీ, ఆప్ మధ్య భారీ పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది.
Arvind Kejriwal News: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం (డిసెంబర్ 25) బిజెపిని టార్గెట్ గా చేసుకున్నారు.
Avadh Ojha: ఐఏఎస్, ఐపీఎస్ వంటి యూపీఎస్సీ కోచింగ్‌కి పేరు తెచ్చుకున్న ప్రముఖ విద్యావేత్త అవధ్ ఓజా ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో చేరారు. తాజాగా ఆయన ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. కేజ్రీవాల్‌ని దేవుడితో పోల్చారు. ఒక ఇంటర్వ్యూలో ఓజా ఈ వ్యాఖ్యలు చేశారు.
Delhi Excise Policy: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు భారీ షాక్ తిగింది. ఎక్సైజ్ పాలసీ కేసులో కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కు అనుమతి ఇచ్చారు.
Arvind Kejriwal: రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రసంగం ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపింది. బాబాసాహెబ్ అంబేద్కర్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, ఆప్, డీఎంకే ఇతర ఇండియా కూటమి పార్టీలు ఆందోళన చేపట్టాయి. పార్లమెంట్ ఆవరణలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, తన వ్యాఖ్యల్ని ఎడిట్ చేసి, కాంగ్రెస్ తప్పుదోవ పట్టిస్తోందిన నిన్న అమిత్ షా క్లారిటీ ఇచ్చారు.