ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దగ్గర పని చేస్తున్న పర్సనల్ సెక్రటరీ ఇంట్లో ఇవాళ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనిఖీలు చేస్తుంది. సుమారు 10 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నట్లు సమాచారం.
అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఏదైనా చేయొచ్చని. తిమ్మిని బమ్మిని చేసి అడ్డదారుల్లో వెళ్లే ఆఫీసర్స్‌కు దేశ సర్వోన్నత న్యాయస్థానం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇటీవల చండీగఢ్ మేయర్ ఎన్నిక సందర్భంగా రిటర్నింగ్ అధికారి చేసిన పనికి సుప్రీంకోర్టు (Supreme Court) గట్టిగానే చీవాట్లు పెట్టింది.
ఢిల్లీ కేంద్రంగా బీజేపీ-ఆప్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఇరు పార్టీలు మాటల-తూటాలు పేల్చుకుంటున్నాయి. ‘ఆపరేషన్ లోటస్-2.0’ అంటూ ఆప్ చేసిన ఆరోపణలపై బీజేపీ తాజాగా కౌంటర్ ఇచ్చింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ముచ్చటగా ఐదోసారి ఈడీ విచారణకు డుమ్మాకొట్టారు. గతంలో నాలుగు సార్లు విచారణకు దూరంగా ఉన్నారు. తాజాగా శుక్రవారం కూడా ఆయన విచారణకు హాజరుకాలేదు.
Arvind Kejriwal: చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు అన్యాయమని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఆరోపిస్తోంది. దీంతో ఈ రెండు పార్టీల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఈ రోజు ఆప్ నిరసనకు పిలుపునిచ్చింది. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ రిగ్గింగ్ చేసి గెలుపొందిందని, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఏ స్థాయికైనా వెళ్లొచ్చని ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఈడీ విచారణకు డుమ్మాకొట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లిక్కర్ స్కామ్ కేసులో శుక్రవారం ఈడీ విచారణకు హాజరుకావాలంటూ గత నెలాఖరున అధికారులు సమన్లు జారీ చేశారు.
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. మద్యం కేసులో ఆయనకు ఇప్పటికే నాలుగు సార్లు నోటీసులు ఇచ్చింది. తాజాగా మళ్లీ ఐదోసారి సమన్లు పంపించింది. ఫిబ్రవరి 2 విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
జనవరి 22వ తేదీన అయోధ్య రామ మందిర ప్రాన ప్రతిష్ట కార్యక్రమానికి తాను వెళ్లి తీరుతానని టీమిండియా మాజీ క్రికెటర్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ హర్భజన్ సింగ్ వెల్లడించారు. ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకొకున్నా.. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని క్లారిటీ ఇచ్చారు.