Amit Shah: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ముస్లింలకు వ్యతిరేకం కాదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. ప్రతిపక్షాలు అబద్ధాల రాజకీయాలను ఆశ్రయిస్తున్నాయని మండిపడ్డారు. దేశంలోని మైనారిటీలు భయపడాల్సిన పని లేదని, ఎందుకంటే ఇది ఏ పౌరుడి హక్కులను వెనక్కి తీసుకోదని ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూ ఆయన మరోసారి స్పష్టం చేశారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్‌కి వచ్చిదిన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు, క్రిస్టియన్లతో సహా ముస్లిమేతర వలసదారులకు పౌరసత్వాన్ని అందించడమే…
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Kejriwal) అత్యవసర కేబినెట్ భేటీకి పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం 4 గంటలకు మంత్రివర్గం సమావేశం (Cabinet Meeting) కానుంది. కేజ్రీవాల్ నివాసంలో కేబినెట్ భేటీ జరగనుంది.
Arvind kejriwal : మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు చిక్కులు పెరిగే అవకాశం ఉంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఫిర్యాదు మేరకు ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు గురువారం అరవింద్ కేజ్రీవాల్‌ను మార్చి 16న హాజరు కావాలని ఆదేశించింది.
Delhi Budget 2024: ఢిల్లీ ఆర్థిక మంత్రి అతిషి సోమవారం (మార్చి 4) కేజ్రీవాల్ ప్రభుత్వ 10వ బడ్జెట్‌ను సమర్పించారు. బడ్జెట్‌లో విద్యకు రూ.16,396 కోట్లు కేటాయించారు.
బీజేపీ ఐటీ సెల్‌కు సంబంధించిన వీడియోను రీట్వీట్ చేసినందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పారు. బీజేపీ ఐటీ సెల్ గురించి యూట్యూబర్ ధృవ్ రాఠి షేర్ చేసిన వీడియోను రీట్వీట్ చేయడం తన తప్పు అని కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో అంగీకరించారు.
ఒక పరువు నష్టం కేసులో తనకు జారీ అయిన సమన్లను ఢిల్లీ హైకోర్టు సమర్థించడాన్ని సవాల్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ మీద సుప్రీంకోర్టులో నేడు (సోమవారం) విచారణ జరుగనుంది.
లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు రాలేని చెప్పారు. దర్యాప్తు సంస్థ ఇచ్చిన సమన్లకు ఇవాళ ఆయన ఈడీ కార్యాలయానికి వెళ్లాల్సి ఉండగా.. తాను హాజరుకావడం లేదని సీఎం చెప్పారు.
లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) అధికారులు మరోసారి సమన్లు ఇచ్చారు.
Arvind Kejriwal: ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లకు హాజరుకాలేదు. ఈడీ సమన్లను దాటవేయడం ఇది ఆరోసారి. ఈడీ సమన్లు చట్టవిరుద్ధమని.. ఈ విషయం ప్రస్తుతం కోర్టులో ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పింది. ఈ రోజు విడుదల చేసిన ప్రకటనలో.. ఈడీ స్వయంగా కోర్టును ఆశ్రయించిందని.. పదేపదే సమన్లు జారీ చేసే బదులు, ఈ అంశంపై కోర్టు నిర్ణయం కోసం వేచి ఉండాలని సూచించింది.