Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్యం కుంభకోణంలో అరెస్టైతే, ఆయన రాజీనామా చేయాలా లేక జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపాలా? దీనిపై శుక్రవారం నుంచి ఢిల్లీలో దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అభిప్రాయ సేకరణ ప్రారంభించబోతోంది.
Arvind Kejriwal: ఢిల్లీలో మరోసారి అధికారులు వర్సెస్ ప్రభుత్వం మధ్య వార్ ముదిరింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విజిలెన్స్ మంత్రి అతిషి నివేదికను ఎల్జీ వీకే సక్సేనాకు పంపారు. అతనిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.
Arvind Kejriwal: ప్రధాని నరేంద్రమోడీకి వ్యతిరేకంగా కించపరిచేలా, అవమానకరమైన పోస్టులను షేర్ చేసినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సోషల్ మీడియా పోస్టుల్లో ప్రధానికి వ్యతిరేకంగా చేసిన ప్రకటనపై గురువారం లోగా వివరణ ఇవ్వాలని ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి నోటీసులు ఇచ్చింది.
Delhi Pollution: ఢిల్లీ-ఎన్‌సీఆర్ కాలుష్యం ఇప్పుడు ప్రాణాంతకంగా మారుతోంది. దేశ రాజధాని, చుట్టుపక్కల ప్రాంతాలు గ్యాస్ ఛాంబర్‌లుగా మారాయి. గాలి నాణ్యత సూచిక చాలా పేలవమైన విభాగంలో ఉంది.
Arvind Kejriwal: వచ్చే ఏడాది హర్యానా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. పంజాబ్ లో 117 స్థానాలకు గానూ 92 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చినట్లే హర్యానలో కూడా పాగా వేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చూస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఆప్ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆ రాష్ట్రంలో పర్యటించారు. హర్యానాలోని రోహ్‌తక్‌లో జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు.
Arvind Kejriwal : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు పంపింది. నవంబర్ 2న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆయనను విచారణకు పిలిచింది.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎంపీ సంజయ్ సింగ్‌ని ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఇప్పటి వరకు ముగ్గురు కీలక ఆప్ నేతలు జైళ్లలో ఉన్నారు. సత్యేంద్ర జైన్, మనీష్ సిసోడియాల తర్వాత ఇప్పుడు సంజయ్ సింగ్ జైలులోకి వెళ్లారు.
Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), కాంగ్రెస్ పార్టీల మధ్య విభేదాలు కనిపిస్తున్నాయి. 2015 మాదకద్రవ్యాల కేసులో పంజాబ్‌కి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్‌పాల్ సింగ్ ఖైరాను ఆప్ ప్రభుత్వం అరెస్ట్ చేయడంతో ఇరు పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. ఆప్ ప్రభుత్వం తమపై రాజకీయ ప్రతీకారానికి పాల్పడుతోందని పంజాబ్ కాంగ్రెస్ యూనిట్ ఆరోపించింది. అయితే అతనిపై చట్టప్రకారమే చర్యలు తీసుకుంటున్నామని ఆప్ విమర్శలను తోసిపుచ్చింది. మరోవైపు ఇరు పార్టీలు కూడా ఇండియా కూటమిలో భాగంగా ఉన్నాయి.
ఇండియా కూటమికి మద్దతు ఇవ్వడానికి తమ పార్టీ కట్టుబడి ఉందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం చెప్పారు. భారత కూటమితో తమ పార్టీ విడిపోదని స్పష్టం చేశారు.