Arvind Kejriwal: చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు అన్యాయమని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఆరోపిస్తోంది. దీంతో ఈ రెండు పార్టీల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఈ రోజు ఆప్ నిరసనకు పిలుపునిచ్చింది. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ రిగ్గింగ్ చేసి గెలుపొందిందని, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఏ స్థాయికైనా వెళ్లొచ్చని ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు.
Read Also: South Central Railway: దక్షిణ మధ్య రైల్వేలో కేంద్ర బడ్జెట్ కేటాయింపులు ఎంతో తెలుసా..?
బీజేపీ వైఖరికి నిరసనగా ఢిల్లీలో బీజేపీ పార్టీ ప్రధాన కార్యాలయానికి ముందు ఆప్ ప్రదర్శన నిర్వహించింది. పోలీసులు భారీగా మోహరించి ఆప్ కార్యకర్తల్ని అడ్డుకున్నారు. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ ఓట్లను దొంగలించిందని కేజ్రీవాల్ ఆరోపించారు. మేయర్, సీనియర్ డిప్యూటీ మేయర్ మరియు డిప్యూటీ మేయర్ పదవులకు మంగళవారం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్-ఆప్ కూటమిని ఓడించి అన్నింటిని గెలుచుకుంది.
గత కొన్నేళ్లుగా బీజేపీ రిగ్గించ్ చేస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి, ఈవీఎం ట్యాంపరింగ్, ఓటర్ల జాబితా నుంచి ఓట్లను తొలగించడం వంటివి చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయని, అయితే వాటికి ఆధారాలు కనుగొనబడలేదని, కానీ చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారని కేజ్రీవాల్ అన్నారు. మేయర్ ఎన్నికల్లోనే ఇలాంటి అవకతవకలకు పాల్పడిగే, పార్లమెంట్ ఎన్నికల్లో పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని కాపాడాలని ఆయన కోరారు.