Arvind Kejriwal: ఢిల్లీలో తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆప్ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం అసెంబ్లీ వేదికగా ఆరోపించారు. అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గిన తర్వాత బీజేపీపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో బీజేపీకి ఆప్ అతిపెద్ద ముప్పుగా ఉందని, అందుకే తమ పార్టీపై, నేతలపై అన్ని వైపుల నుంచి దాడులు చేస్తోందని కేజ్రీవాల్ అన్నారు. తాను అనేక దాడుల్ని ఎదుర్కొంటున్నానని, ఇప్పుడు తనను అరెస్ట్ చేయాలని బీజేపీ అనుకుంటుందని,…
Arvind Kejriwal : ఆరు సమన్ల తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం (ఫిబ్రవరి 17) ఈడీ కోర్టు విచారణకు హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలో ఆయన పాల్గొన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు. ఇవాళ (ఫిబ్రవరి 17న) అసెంబ్లీలో ఈ తీర్మానంపై చర్చ జరగనుంది.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీలో ఆయన విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం సభ శనివారానికి వాయిదా పడింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత సంజయ్ సింగ్‌లకు గుజరాత్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాని మోడీ విద్యార్హతపై ప్రశ్నలు లేవనెత్తిన అరవింద్ కేజ్రీవాల్, సంజయ్ సింగ్‌లకు కోర్టు నుంచి ఊరట లభించలేదు.
లిక్కర్ పాలసీ కేసులో (Liquor Policy Case) ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్‌కు (Delhi CM Arvind Kejriwal) మరోసారి ఈడీ నోటీసు ఇచ్చింది. ఈ నెల 19న హాజరుకావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేసింది.
Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ రేపు అయోధ్య వెళ్లనున్నారు. కుటుంబ సమేతంగా ఆయన రామ మందిరాన్ని సందర్శించనున్నారు. అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఆయన భార్య, తల్లిదండ్రులు అయోధ్య రాముడిని దర్శించుకోనున్నారు. కేజ్రీవాల్‌తో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా అయోధ్య యాత్రకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
కేంద్రం తీరుకు నిరసనగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఢిల్లీ వేదికగా (Delhi) ఆందోళనకు దిగుతున్నాయి. జంతర్‌మంతర్ దగ్గర బుధవారం కాంగ్రెస్ ఆందోళన చేపట్టగా.. గురువారం కేరళ ప్రభుత్వం నిరసనకు దిగింది.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కేసును విచారిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తమ ముందు విచారణకు హాజరుకావాలని కేజ్రీవాల్‌కి ఇప్పటికీ 5 సార్లు సమన్లు పంపింది, అయితే వీటన్నింటికి కూడా కేజ్రీవాల్ హాజరుకాలేదు. దీంతో ఈడీ ఢిల్లీ రోస్ ఎవెన్యూకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా కోర్టు ఈరోజు.. సీఎం కేజ్రీవాల్ ఈడీ 5 సమన్లను ఎందుకు దాటవేశారనే దానిపై ఫిబ్రవరి…