ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయం దగ్గర ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. దిన్ దయాళ్ ఉపాద్యాయ మార్గ్‌లో ఉన్న కార్యాలయం ఎదుట ఆప్ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేశారు
Fans sloganeering against CM Arvind Kejriwal Arrest in DC vs RR Match: ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మ్యాచ్‌లో కొందరు ఫాన్స్ రాజకీయ నినాదాలు చేశారు. స్టేడియంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మద్దతుగా నినాదాలు చేస్తూ.. ప్లకార్డ్స్ ప్రదర్శించారు. ‘జైల్ కా జవాబ్ వోట్ సే’ (కేజ్రీవాల్‌ను జైలుకు పంపించినందుకు…
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఆప్ సర్కిల్‌లో.. సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు రాఘవ్ చద్దా.. అదేనండీ.. ఆప్ రాజ్యసభ సభ్యుడు, యంగ్ లీడర్ రాఘవ్ చద్దా. ఆప్‌లో చాలా చురుగ్గా ఉండే ఈ రాఘవ్ చద్దా.. గత కొద్ది రోజుల నుంచి పత్తాలేకుండా పోయారు.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఏప్రిల్ 7న జంతర్ మంతర్ వద్ద నిరాహారదీక్షకు ప్రారంభిస్తుందని ఆ పార్టీ నేత గోపాల్ రాయ్ బుధవారం తెలిపారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో శనివారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట ఢిల్లీ మంత్రి కైలాష్ గహ్లాట్ హాజరయ్యారు. దాదాపు 5 గంటల పాటు ఆయన్ను ఈడీ అధికారులు విచారించారు.
INDIA Alliance : 2024 లోక్‌సభ ఎన్నికల ప్రకటన తర్వాత, బీజేపీయేతర రాజకీయ పార్టీల భారత కూటమి తొలి ర్యాలీని మార్చి 31న ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో నిర్వహించనున్నారు. ఢిల్లీ పోలీసుల నుంచి కూడా ర్యాలీకి ఆమోదం లభించింది.
Arvind Kejriwal Arrest: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేసింది. అయితే, ఆయన అరెస్టుపై ఇటీవల జర్మనీ కొన్ని వ్యాఖ్యలు చేసింది. పూర్తిగా భారత అంతర్గత విషయంపై వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది. అంతే ధీటుగా భారత విదేశాంగ మంత్రిత్వశాఖ జర్మనీని హెచ్చరించింది. జర్మనీ సీనియర్ దౌత్యవేత్తకు భారత్ సమన్లు జారీ చేసింది. ఈ పరిణామం తర్వాత ఈ విషయంలో జర్మనీ తన స్వరాన్ని మార్చింది.
Arvind Kejriwal arrest: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ అరెస్ట్ చేసింది. అయితే, ఈ అరెస్ట్‌పై అమెరికా చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. అమెరికా దౌత్యవేత్తకు భారత్ సమన్లు జారీ చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ బుధవారం మధ్యాహ్నం అమెరికా తాత్కాలిక డిప్యూటీ చీఫ్ మిషన్ గ్లోరియా బెర్బెనాను పిలిచింది. 40 నిమిషాల పాటు సమావేశం జరిగింది.
Arvind Kejriwal Arrest: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ అరెస్ట్ చేసింది. కోర్టు ఆయనను ఈడీ కస్టడీకి అప్పగించింది. ఈ నేపథ్యంలో ఆయన అరెస్టుపై అమెరికా స్పందించింది.