Mahakumbh 2025 : భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఆధ్యాత్మిక వేడుకల్లో మహా కుంభ మేళా ఒకటి. గంగా, యమునా, సరస్వతి నదుల సంగమ స్థలంలో జరిగే ఈ పుణ్య స్నానానికి కోట్లాది మంది భక్తులు తరలివస్తారు.
AV Ranganath : ప్రమాదాలు జరిగిన వెంటనే ఆ సమాచారాన్ని క్షణాల్లో హైడ్రా (Hydra)కు చేరేలా టెక్నాలజీని అభివృద్ధి చేయాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. శుక్రవారం తెల్లవారుజామున పాత ముంబై హైవే వద్ద షేక్‌పేట ప్రాంతంలోని డ్యూక్స్ అవెన్యూ భవనంలో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో రంగనాథ్ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అగ్నిప్రమాదానికి గల కారణాలను హైడ్రా డీఆర్ఎఫ్ (Hydra DRF) బృందం , ఫైర్ సిబ్బందితో చర్చించారు. డ్యూక్స్ అవెన్యూ భవనంలో…
Internet Users In India: భారతదేశంలో రికార్డు స్థాయిలో ఇంటర్నెట్ యూజర్లు పెరుగుతున్నారు. 2025 నాటికి దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 90 కోట్లను దాటుతుందని గురువారం ఒక నివేదిక వెల్లడించింది. డిజిటల్ కంటెంట్ కోసం దేశంలోని ప్రాంతీయ భాషల వినియోగం పెరుగుతుండటం ఇంటర్నెట్ యూజర్ల పెరుగుదలకు కారణంగా ఉందని చెప్పింది. ఇండియాలో 2024 నాటికి ఈ సంఖ్య 88.6 కోట్లకు చేరుకుంది. గత ఏడాదితో పోలిస్తే 8 శాతం బలమైన వృద్ధిని సూచిస్తుంది.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉండాలనే తమ నిబద్ధతను కొనసాగిస్తామని మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ సత్య నాదెళ్ల తెలిపారు. హైదరాబాద్‌లోని సత్య నాదెళ్ల నివాసంలో ఆయనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం సోమవారం భేటీ అయింది. ఈ సందర్భంగా నైపుణ్యాభివృద్ధి, భవిష్యత్ అవసరాలకు తగినట్లు మౌలిక సదుపాయాలను మెరుగుపర్చే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికతను సత్య నాదెళ్ల ప్రశంసించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఇంటికి వెళ్లారు. సీఎంతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారి కూడా ఉన్నారు. అనంతరం.. సత్య నాదెళ్లతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. మైక్రోసాఫ్ట్ విస్తరణ అవకాశాలపై చర్చిస్తున్నారు. తమ వ్యాపారాన్ని విస్తరించాలని మైక్రోసాఫ్ట్ కంపెనీ చాన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తోంది.
Indian American: యూఎస్ కు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈసారి తన కార్యవర్గంలో ఇండో- అమెరికన్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు భారత సంతతికి చెందిన నేతలకు ఆయన కీలక బాధ్యతలు ఇచ్చారు.
AI Caught Thiefs: రాజస్థాన్‌లోని చురులోని రతన్‌గఢ్ ప్రధాన మార్కెట్లోని ఘంటాఘర్, ఘర్ కూడలి మధ్య ఉన్న నగల దుకాణంలో వారం క్రితం జరిగిన కోటి రూపాయల విలువైన చోరీ కేసులో, పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి కేసును చేధించారు. ఈ విషయమై చూరు ఎస్పీ జై యాదవ్ సమాచారం అందించారు. ఏఐ (AI) సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ముఠాలోని ముగ్గురు నిందితులను పోలీసు బృందం అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. చోరీ ఘటనను దొంగలు…
మనుషులను ఉతికి ఆరేసే మెషీన్లు రాబోతున్నాయి.. రోజంతా రకరకాల పనులతో బాగా అలసిపోయిన వారికి స్నానం చేసే ఓపిక ఉండకపోతే.. మెషీన్ టబ్‌లో 15 నిమిషాలు కూర్చుంటే చాలు.. కాసేపటి తర్వాత తలతలలాడే శరీరంతో బయటకు వస్తారట.
High Court Questioned Central Government: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డీప్‌ఫేక్ టెక్నాలజీని నియంత్రించేందుకు ఏం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. దీనికి సంబంధించి మూడు వారాల్లోగా స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ నవంబర్ 21న జరగనుంది. డీప్‌ఫేక్‌ల ద్వారా వీడియోలు సృష్టించి అప్లోడ్ చేస్తున్నారని, వాటి ద్వారా వ్యక్తుల గురించి తప్పుడు సమాచారాన్ని అప్లోడ్ చేస్తున్నారని కోర్టు…
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన రాజమౌళి తెలుగులో నెంబర్ వన్ డైరెక్టర్ అనడం ఎలాంటి సందేహం లేదు. ఆ మాటకొస్తే తెలుగులోనే కాదు ఇండియాలోనే టాప్ మోస్ట్ డైరెక్టర్స్ లిస్టులో ఆయన కూడా ఉంటారు. అంతే కాకుండా ఆయన తన సినిమాలలో హైటెక్ విజువల్ ఎఫెక్ట్స్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇండియాలో చాలా సినిమాలకు ఆయన వాడిన విజువల్ ఎఫెక్ట్స్ కి మంచి గుర్తింపు వచ్చింది. చేసిన వాళ్ళకి…