Deepseek AI : డీప్‌సీక్… చాట్‌జీపీటీ అమ్మ మొగుడిది..!
- వచ్చిరాగానే సంచలనాలను నమోదు చేస్తున్న డీప్‌సీక్.
- చాట్‌జీపీటీకి చెక్ పెట్టేందుకు సిద్దమైన డీప్‌సీక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deepseek AI: ఇప్పుడు ఎక్కడ చూసినా AI మాటే వినిపిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు ప్రపంచం అడుగులు వేస్తోంది. రాబోయే కొన్నేళ్లలో AI మన భవిష్యత్తును సమూలంగా మార్చేస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చిన మార్పులు మన జీవితాలను ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయి. ఇక AI పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే అంచనాలకు అందని విధంగా గణనీయమైన మార్పులు కనిపించడం ఖాయం. ఇప్పటికే చాట్ జీపీటీ, జెమిని, కోపైలట్ లాంటివి AIలో దూసుకుపోతున్నాయి. వీటన్నిటిలో చాట్ జీపీటీ అగ్రగామిగా ఉంది. అయితే ఇప్పుడు చాట్ జీపీటీని మించినదొకటి వచ్చేసింది.
చైనా ఇప్పుడు అన్ని రంగాల్లో దూసుకుపోతోంది. అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికాను సైతం మించి సత్తా చాటుతోంది. అంచనాలకు ఏమాత్రం అందని విధంగా చైనా ప్రయాణం సాగిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కూడా అమెరికాను మించి దూసుకెళ్తోంది. ఇప్పటి వరకూ AI అనగానే మనకు గుర్తొచ్చేది చాట్ జీపీటీ. చాట్ జీపీటీ ద్వారా మనం ఇప్పటికే అనేక పనులు చేస్కుంటున్నాం. మొబైల్ పరిజ్ఞానం ఓ మోస్తరుగా ఉన్నవాళ్లంతా చాట్ జీపీటీని విచ్చలవిడిగా వాడేస్తున్నారు. మనకు ఏది కావాలన్నా చాట్ జీపీటీని అడిగేస్తున్నాం. ఈమెయిల్ రాయాలన్నా, ఏదైనా సలహా కావాలన్నా, ఇంకేదైనా ట్రాన్స్ లేషన్ కావాలన్నా.. ఏదైనా కొత్త భాష నేర్చుకోవాలన్నా.. చాట్ జీపీటీ మనకు హెల్ప్ చేస్తోంది. సంక్లిష్టమైన అంశాలను కూడా సులభంగా వివరించి చెప్తోంది. చాట్ జీపీటీతో పెద్ద పెద్ద సమస్యలను కూడా సులువుగా పరిష్కరించుకోగలుగుతున్నాం.
Also Read
- VW 24 inch QLED TV: VW 24 ఇంచెస్ HD Ready QLED TV.. రూ.5 వేలలోనే బెస్ట్ బడ్జెట్ టీవీ!
- Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
- Instagram Addiction: టీనేజర్లను సోషల్ మీడియాకు బానిసలుగా మార్చేందుకే ఇన్‌స్టా..?.. మెటాపై తీవ్ర ఆరోపణలు
- 10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
Also Read: NTR: జూనియర్ ఎన్టీఆర్ పై హాలీవుడ్ డైరెక్టర్ సంచలన కామెంట్స్..
ఇన్నాళ్లూ చాట్ జీపీటీని మించింది మరొకటి లేదని అందరం అనుకున్నాం.. కానీ చైనా ఇప్పుడు చాట్ జీపీటీని మించిన AI టూల్ ను అభివృద్ధి చేసింది. అదే డీప్ సీక్..! ఇదిప్పుడు చాట్ జీపీటీని, అమెరికాను కూడా వణికించేస్తోంది. చైనా అంటే చాలా మందికి చిన్నచూపు ఉంటుంది. కానీ ఆ దేశం సృష్టిస్తున్న సంచలనాలు అన్నీఇన్నీ కావు. ప్రపంచంలో ఎవరికైనా అసాధ్యమేమో కానీ చైనాకు మాత్రం కాదు. అగ్రదేశాలకు సైతం చేతకాని అనేక అద్భుతాలను చైనా చేసి చూపెడుతోంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కూడా చైనా దూసుకెళ్తోంది. చాట్ జీపీటీ ద్వారా ప్రపంచానికి తామే కింగ్ అని అమెరికా ఇన్నాళ్లూ భావిస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు చైనా అభివృద్ధి చేసిన డీప్ సీక్ చూసిన తర్వాత అమెరికా కూడా నోరెళ్లబెడుతోంది. ఇది నిజమేనా అని ఆశ్చర్యపోతోంది.
అసలేంటీ డీపీ సీక్.. ఇది ఏం చేస్తుంది..? చాట్ జీపీటీని మించి ఇందులో ఉన్న స్పెషాలిటీలేంటి..? అమెరికాతో పాటు ఇతర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థలు డీప్ సీక్ ను చూసి ఎందుకు భయపడుతున్నాయి..? చైనాకు చెందిన డీప్ సీక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సంచలనం సృష్టిస్తోంది. అతి తక్కువ ఖర్చుతో అత్యంత ప్రభావవంతమైన మోడళ్లను ఇది అభివృద్ధి చేసింది. దీన్ని చూసి ప్రపంచంలోని దిగ్గజ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థలు బెంబేలెత్తిపోతున్నాయి. సిలికాన్ వ్యాలీలోని ప్రముఖ టెక్ కంపెనీల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. డీప్ సీక్ ధాటికి అమెరికా స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి దిగ్గజ కంపెనీలు రూపొందించిన వాటికంటే డీప్ సీక్ కొన్ని వందల రెట్లు ప్రభావవంతంగా ఉంది. అందుకే అమెరికా వణికిపోతోంది.
నిన్నటివరకూ డీప్ సీక్ పేరు పెద్దగా తెలీదు. కానీ అమెరికాలో స్టాక్ మార్కెట్లు కుప్పకూలిన తర్వాత దీనిపేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతోంది. డీప్ సీక్ గురించి తెలుసుకునేందుకు చాలా మంది గూగుల్ చేస్తున్నారు. చైనాలోని హ్యోంగ్ జోకు చెందిన ఏఐ రీసెర్చ్ ల్యాబ్ డీప్ సీక్ ను అభివృద్ధి చేసింది. క్వాంటిటేటివ్ ఫైనాన్స్ లో స్పెషలైజేషన్ చేసిన పారిశ్రామికవేత్త లియాంగ్ వెన్ ఫెంగ్ 2023లో డీప్ సీక్ స్టార్టప్ కంపెనీని ప్రారంభించారు. పైనాన్షియల్ డేటాను విశ్లేషించేందుకు AIని వినియోగించే హెడ్జ్ ఫండ్ కు ఈయన గతంలో నేతృత్వం వహించారు. ఇతని టీం ఓపెన్ సోర్స్ ఏఐ మోడల్స్ ను డెవలప్ చేసింది. దీన్ని డీప్ సీక్ ఆర్1 అని పిలుస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డెవలపర్స్ కి దీన్ని ఉచితంగా ఇచ్చింది. వాళ్లు తమ టెక్నాలజీని మెరుగుపరుచుకునేందుకు డీప్ సీక్ ఆర్1ను వాడుకుంటున్నారు.
Also Read: Vishnuvardhan Reddy: గద్దర్‌పై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు.. పద్మ పురస్కారం ఎలా ఇస్తారు..?
చాట్ జీపీటీతో పోల్చితే డీప్ సీక్ ఎందుకంత ప్రత్యేకం అని చాలా మంది ఆరా తీస్తున్నారు. దీని పనితీరు చూసిన తర్వాత ఆశ్చర్యపోతున్నారు. మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు భాగస్వాములుగా ఉన్న ఓపెన్ ఏఐ సంస్థ చాట్ జీపీటీని అభివృద్ధి చేసింది. ఇప్పటివరకూ చాట్ జీపీటీనే ఆర్టిఫిషియల్ రంగంలో అగ్రగామిగా ఉంది. అయితే ఇప్పడు డీప్ సీక్ పనితీరు చూసిన తర్వాత చాట్ జీపీటీ దీని ముందు దిగదుడుపే అని చెప్తున్నారు. మనం ఇచ్చిన ప్రాంప్ట్ కి సమాధానం ఇచ్చే ముందు రీజనింగ్ కూడా ఇస్తుండడం డీప్ సీక్ ప్రత్యేకత. చాట్ జీపీటీ సహా మిగిలిన సంస్థలేవీ ఈ పని చేయలేకపోతున్నాయి. అంతేకాదు.. చాట్ జీపీటీ లాంటి వాటిని అభివృద్ధి చేసేందుకు మిలియన్ డాలర్లు ఖర్చు చేశాయి ఓపెన్ ఏఐ లాంటి సంస్థలు. చాట్ జీపీటీ అభివృద్ధికి వంద మిలియన్ డాలర్లకు పైగా ఖర్చయింది. కానీ డీప్ సీక్ ను కేవలం 5.6 మిలియన్ డాలర్ల ఖర్చుతోనే రూపొందించారు. పైగా డేటా విషయంలో కానీ, టెక్నాలజీలో కానీ, స్టోరేజ్ విషయంలో కానీ డీప్ సీక్ మిగిలినవాటి కంటే చాలా ముందుంది.
డీప్ సీక్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత టాప్ మోస్ట్ ఆర్టిఫిషియల్ సంస్థలన్నీ ఆశ్చర్యపోయాయి. చైనా దెబ్బకు అమెరికన్ మార్కెట్లు కూడా కుప్పకూలాయి. డీప్ సీక్ పనితీరు టెక్ నిపుణులను ఆశ్చర్యపరిచింది. దీని పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఆపిల్ స్టోర్ లో చాట్ జీపీటీని వెనక్కు నెట్టి డీప్ సీక్ ఫస్ట్ ప్లేస్ లోకి వచ్చింది. లక్షలాది మంది డీప్ సీక్ ని డౌన్లోడ్ చేసుకుంటున్నారు. దీంతో సర్వర్ తట్టుకోలేక క్రాష్ అయింది. ఆ వెంటనే డీప్ సీక్ AI అసిస్ట్ పై సైబర్ ఎటాక్ జరిగింది. దీంతో రిజిస్ట్రేషన్స్ ను తగ్గిస్తున్నట్టు డీప్ సీక్ వెల్లడించింది. మరోవైపు ఏఐపై గంపెడాశలు పెట్టుకున్న అమెరికన్ టెక్ కంపెనీలకు డీప్ సీక్ గట్టి షాక్ ఇచ్చింది. దీంతో సోమవారం నాస్డాక్ 3 శాతం పతనమైంది. ఎన్విడియా సంస్థ షేర్లు 17శాతం నష్టపోయాయి. ఒక్క ట్రేడింగ్ సెషన్ లోనే 600 మిలియన్ డాలర్లను ఎన్విడియా నష్టపోయింది.
మరి డీప్ సీక్ లో లోపాలేవీ లేవా అనే సందేహాలు కూడా తలెత్తుతున్నాయి. ఇంత తక్కువ ఖర్చుతో రూపొందిన ఈ మోడల్ ను నమ్మొచ్చా అని చాలా మంది అనుమానిస్తున్నారు. ఏ కంపెనీకైనా కొన్ని బలహీనతలు ఉంటాయి. అలాగే డీప్ సీక్ కు కూడా కొన్ని మైనస్ లు ఉన్నాయి. చైనా సంస్థ కావడమే డీప్ సీక్ కు అతిపెద్ద మైనస్. భద్రత విషయంలో ఈ సంస్థను పూర్తిగా నమ్మడానికి వీల్లేదు. మన డేటాను దుర్వినియోగం చేసే అవకాశాలుంటాయి. డీప్ సీక్ డౌన్లోడ్ చేసుకునేవాళ్లు తమ డేటా విషయంలో అప్రమత్తంగా ఉండడం అవసరం. ఇది చైనా సంస్థ కాబట్టి తమ దేశ భద్రతాపరమైన అంశాలను డీప్ సీక్ సెన్సార్ చేస్తోంది. దేశాధ్యక్షుడు జిన్ పింగ్, తైవాన్ దురాక్రమణ లాంటి అంశాలపై ప్రశ్నలను ఇది తప్పించుకుంటోంది. కాబట్టి దీని ప్రామాణికతను నమ్మడానికి వీల్లేదు.
చాట్ జీపీటీ సహా చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థలు తమ సర్వీసులను వాడుకునేందుకు ఎంతోకొంత పేమెంట్ వసూలు చేస్తున్నాయి. కానీ డీప్ సీక్ మాత్రం పూర్తిగా ఫ్రీ..! పైగా మిగిలినవాటి కంటే వేగంగా, సమర్థవంతంగా పనిచేస్తోంది. అందుకే డీప్ సీక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పెద్ద సంచలనంగా మారింది. మరి మున్ముందు ఇది ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూద్దాం..
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!