Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దును సుప్రీంకోర్టు సమర్థించింది. ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదే అని, రాజ్యాంగానికి లోబడే నిర్ణయం ఉందని తెలిపింది. ఆర్టికల్ 370 కేవలం తాత్కిలిక సదుపాయం మాత్రమే అని, ఇది దేశంలో అవిభాజ్య అంతర్భాగమని చెప్పింది. అయితే జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్రానికి సూచించింది.
అయితే ఈ తీర్పుపై దాయాది దేశం పాకిస్తాన్ తన అక్కసు వెల్లగక్కుతోంది. ఇప్పటికే తీర్పుకు విలువలేదని పాకిస్తాన్ అభివర్ణించగా.. దాని మిత్రదేశం చైనా, కాశ్మీర్ అంశాన్ని ఇరు దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కోరింది. ఇదిలా ఉంటే పాక్ మాజీ ప్రధాని, ప్రస్తుతం జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ కూడా భారత సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తప్పుపట్టారు.
Jammu Kashmir: కాశ్మీర్ సమస్యపై డ్రాగన్ కంట్రీ చైనా కీలక వ్యాఖ్యలు చేసింది. జమ్మూకాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని, ఆర్టికల్ 370ని రద్దును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ఆర్టికల్ 370 రద్దుపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఐదుగురు న్యాయమూర్తులు ధర్మాసనం ఏకగ్రీవంగా సమర్థించింది. అయితే ఈ తీర్పు తర్వాతి రోజే చైనా కామెంట్స్ చేసింది.
Supreme Court verdict on abrogation of Article 370: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దు అంశంపై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పు వెలువరించింది. జమ్మూకశ్మీర్ అంశంలో రాష్ట్రపతి ప్రకటనపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఆర్టికల్ 370ని రద్దు చేయడం అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో తీసుకున్న నిర్ణయం అని పేర్కొంది. ఆర్టికల్ 370 అనేది తాత్కాలిక నిబంధన మాత్రమే అని సుప్రీంకోర్టు వెల్లడించింది. న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్…