Supreme court: ‘‘ఉరితీయడం’’ ద్వారా మరణశిక్ష విధించడంపై సుప్రీంకోర్టులో ఆసక్తికర చర్చ జరిగింది. ఉరికి బదులుగా, ప్రాణాంతక ఇంజెక్షన్ల ద్వారా మరణశిక్ష విధించడానికి కేంద్రం ఇష్టం చూపడం లేదని సుప్రీంకోర్టు బుధవారం వ్యాఖ్యానించింది. ప్రభుత్వం, ఉరికి బదులుగా వేరే విధంగా మరణశిక్ష విధించేందుకు సిద్ధంగా లేదు అని చెప్పింది.
2025 ఆసియా కప్‌లో భాగంగా సెప్టెంబర్ 14న భారత్, పాకిస్థాన్ మధ్య ఒక మ్యాచ్ జరగనుంది. గత కొన్ని రోజులుగా ఈ మ్యాచ్ గురించి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంతలో పూణేకు చెందిన సామాజిక కార్యకర్త కేతన్ తిరోద్కర్ ఈ మ్యాచ్ అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మ్యాచ్ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం రిట్ ఆఫ్ మాండమస్ లేదా ఇతర తగిన ఉత్తర్వులను జారీ చేయాలని డిమాండ్ చేశారు.
Divorce case: భార్యభర్తల మధ్య విడాకుల కేసు సుప్రీంకోర్టు కీలక చర్చకు దారి తీసింది. ఈ కేసు ఆర్టికల్ 21 ద్వారా సంక్రమించే ‘‘గోప్యత హక్కు’’, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌పై ప్రశ్నల్ని లేవనెత్తింది. విడాకులు పిటిషన్ విచారిస్తున్న సుప్రీంకోర్టు, ఒక వ్యక్తి తన భార్య ప్రైవేట్ సంభాషణల్ని గుట్టుచప్పుడు కాకుండా కొన్ని ఏళ్లుగా రికార్డ్ చేసి,
మేజర్లను తమకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోనియ్యకుండా, ఇష్టమైన చోట బతకకుండా ఎవరూ ఆపలేరని అలహాబాద్ హైకోర్ట్ సంచలన తీర్పు ఇచ్చింది. ఈ మేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రతి ఒక్కరికీ ప్రాణ రక్షణ, వ్యక్తిగత స్వేచ్ఛను అందిస్తోందని తెలిపింది.
Bombay High Court: ఒక వ్యక్తి ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘిస్తూ, అక్రమంగా నిర్భంధించిన కేసులో బాంబే హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వ్యక్తిపై బెయిలబుల్ అభియోగాలు మోపినప్పటికీ పోలీసులు సదరు వ్యక్తి విడుదల చేయకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమంగా నిర్భంధంలో ఉంచినందుకు వ్యక్తికి రూ. 2 లక్షల పరిహారం చెల్లించాల్సిందిగా శుక్రవారం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఒక సంగీత ఉపాధ్యాయుడిని అరెస్ట్ చేసి అక్రమంగా నిర్భంధించిన కేసులో పోలీసుల వైఖరిని ప్రశ్నించింది.