2025 ఆసియా కప్‌లో భాగంగా సెప్టెంబర్ 14న భారత్, పాకిస్థాన్ మధ్య ఒక మ్యాచ్ జరగనుంది. గత కొన్ని రోజులుగా ఈ మ్యాచ్ గురించి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంతలో పూణేకు చెందిన సామాజిక కార్యకర్త కేతన్ తిరోద్కర్ ఈ మ్యాచ్ అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మ్యాచ్ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం రిట్ ఆఫ్ మాండమస్ లేదా ఇతర తగిన ఉత్తర్వులను జారీ చేయాలని డిమాండ్ చేశారు.
READ MORE: E-Race Case : ఫార్ములా ఈ-రేస్ కేసులో ఏసీబీ నివేదిక ప్రభుత్వానికి సమర్పణ..కేటీఆర్ పై మళ్లీ దృష్టి
2025 మే నెలలో కశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడిని ఖండించారు. ఇలాంటి ఘటనలను దృష్టిలో ఉంచుకుని శత్రుదేశం పాకిస్థాన్‌తో మ్యాచ్‌లను నిషేధించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. 14న జరగబోయే ఈ మ్యాచ్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ని ఉల్లంఘిస్తుందని తిరోద్కర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ ఆర్టికల్ పౌరులకు జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛను ప్రస్తావిస్తుంది. అయితే.. గౌరవంగా జీవించే సానుకూల హక్కు కూడా ఈ ఆర్టికల్ కిందికి వస్తుంది.
READ MORE: Nepal Gen Z protests: నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ రాజీనామా..
అంతే కాకుండా పిటిషనర్.. జాతీయ క్రీడా పాలన చట్టం 2025 ను అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) ను వెంటనే జాతీయ క్రీడా సమాఖ్య (NSF) పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు, జాతీయ క్రీడా బోర్డు (NSB) విధానాలు, నియమాలను పాటించాలేలా BCCIని ఆదేశించాలనే కోరారు. ఈ మ్యాచ్ మన భద్రతా దళాలు, పౌరులకు తప్పుడు సందేశాన్ని ఇస్తుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం ఈ పిటిషన్‌ను విచారించనుంది.