మళ్లీ లద్ధాఖ్‌లో అలజడి మొదలైంది. గతేడాది ఇండియ చైనా సైనికుల మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణలో రెండు వైపుల నుంచి ప్రాణనష్టం సంభవించింది. రెండు దేశాల సైనికాధికారుల మధ్య 12 విడతలుగా చర్చలు జరిగాయి. ఈ చర్చల సమయంలో ప్యాంగ్యాంగ్, గోగ్రా హైట్స్ వంటి ప్రాంతాల నుంచి ఇరుదేశాలకు చెందిన సైనికులు వెనక్కి వచ్చేశారు. అయితే, మిగతా ప్రాంతాల నుంచి వెనక్కి వచ్చేందుకు చైనా ససేమిరా అంటుండటంతో, చైనా నుంచి ఎదురయ్యే ఎలాంటి విపత్తునైనా తట్టుకునేందుకు ఇండియా సిద్ధం అయింది. ఇందులో భాగంగా సైనికులు సరిహద్దుల్లో యుద్ధవిన్యాసాలు ప్రదర్శించారు. టీ 72, టీ 90 భీష్మ, అజయ్ యుద్ధ ట్యాంకులతో ఈ విన్యాసాలు నిర్వహించారు. దీంతోపాటుగా ట్యాంకుల షెల్టర్లను ఏర్పాటు చేసింది. ఫింగర్ పాయింట్, గల్వాన్ లోయలోసైనిక బలగాలను పెంచింది. ఎడారి, మైదాన ప్రాంతాల నుంచి ట్యాంకర్లను ఎత్తైన పర్వత ప్రాంతాలకు వేగంగా తరలించింది. గడ్డగట్టే చలిలో ఆయుధాలను వినియోగించే అంశంపై సైనికులు యుద్ధవిన్యాసాలు చేశారు. ఈ విన్యాసాలు చైనా సరిహద్దుకు 40 కిలోమీటర్ల పరిధిలోనే ఉండటం విశేషం.
Read: ‘అవలంబిక’గా అందాల అర్చన!