తాలిబన్లు కాబూల్‌లోకి చొచ్చుకొస్తుండటంతో అన్ని దేశాలు తమ రాయబార కార్యాలయాలను మూసివేస్తున్నాయి. తమ ఉద్యోగులు, సిబ్బందిని స్వదేశానికి తరలించేందుకు పెద్ద ఎత్తున విమానాలను సిద్దం చేశారు. ఆర్మీ హెలికాప్టర్లు, విమానాలు అన్నింటిని స్వదేశానికి తరలించేందుకు కాబూల్ ఎయిర్‌పోర్టులో ఉన్నాయి. అయితే, అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు తొలుత వారి దేశానికి చెందిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. బ్రిటన్ తమ వారిని తరలించిన తరువాతే మిగతావారిని తరలిస్తామని చెబుతుండటంతో ఆఫ్ఘన్‌లు ఆందోళన చెందుతున్నారు. ఏ నిమిషంలో ఏమి జరుగుతుందో తెలియక భయపడుతున్నారు. పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు ఏయిర్‌పోర్టుకు చేరుకోవడంతో ఒకదశలో వారికి కంట్రోల్ చేయడం కష్టంగా మారింది. అందుబాటులో ఉన్న విమానాలను ఎక్కేస్తుండంతో అమెరికన్ సైన్యం అప్రమత్తరం అయింది. సైన్యం కాల్పులు జరిపినట్టుగా వార్తలు వస్తున్నాయి. అసలే ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ ఎలాగైనా దేశం విడిచి వెళ్లాలని చూస్తున్న ప్రజలకు ఎయిర్‌పోర్ట్‌లో ఎదురైన సంఘటనలతో మరింత భయాందోళనలు చెందుతున్నారు.