భారత సైనికుల చేతికి కేంద్ర ప్రభుత్వం అత్యాధునిక అయుధాలు అందించింది. చైనా సరిహద్ధుల వెంబడి పహారా కాస్తున్న సైనికులకు అమెరికన్ సిగ్ సావర్ 716, అసాల్ట్ రైఫిల్స్, స్విస్ ఎంపీ 9 గన్స్‌ను సైన్యానికి అందించింది ప్రభుత్వం. లఢఖ్‌లోని న్యోమా వద్ద పహారా కాస్తున్న బలగాలకు ఈ ఆయుధాలను అందించింది. ఈ ప్రాంతంలో నిత్యం ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతుంటాయి. చలికాలంలో మైనస్ 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. సైనికుల రక్షణ కోసం ప్రభుత్వం ఇప్పటికే ఎరెక్టబుల్ మాడ్యులర్ షెల్టర్‌లను సమకూర్చింది. ఇవి రక్షణ ఇవ్వడంతో పాటుగా వెచ్చదనాన్ని ఇస్తాయి. దీనితో పాటుగా ఇప్పుడు అత్యాధునిక ఆయుధాలు సమకూర్చడంతో చైనా నుంచి ఎలాంటి సవాళ్లు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామనే సంకేతాలు ఇచ్చింది ఇండియా.
Read: ట్రీట్మెంట్ కోసం వైజాగ్ లో మెగాస్టార్