జమ్మూ అండ్ కాశ్మీర్‌లో మరోసారి రెచ్చిపోయారు ఉగ్రవాదులు.. పూంచ్ సెక్టార్‌లో జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు.. ఇవాళ ఉదయం పూంచ్ సెక్టార్‌లో జవాన్లు-ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.. ఓ జూనియర్ కమిషన్డ్ అధికారి సహా నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. టెర్రరిస్టుల కోసం ఆర్మీ, స్థానిక పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పూంచ్ సెక్టార్‌లో ఉగ్రవాదుల ఏరివేతకు సైనిక బృందం వెళ్లిన సమయంలో ఎదురుకాల్పులుకు తెగబడ్డారు ఉగ్రవాదులు.
జమ్మూ కాశ్మీర్‌లో మరో కుట్ర చేసేందుకు పాక్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఉగ్రవాదులను ఇండియాలోకి చొరబడేందుకు పరోక్షంగా పాక్ సహకరిస్తూనే డ్రోన్‌ల ద్వారా ఆయుధాలను దేశ సరిహద్దుల్లో జారవిడుస్తోంది. ఇప్పటికే ఇలాంటి డ్రోన్లను ఆర్మీ అధికారులు బోర్డర్‌లో గుర్తించి వాటిని పేల్చి వేశారు. కాగా తాజాగా మరో డ్రోన్ ఇండియా సరిహద్దుల్లోకి ప్రవేశించింది. ఓ ఏకే 47 తుపాకీ, మూడు మ్యాగజైన్లు, 30 బుల్లెట్లు, ఓ టెలిస్కోపును పసుపురంగు ప్యాకెట్లో ప్యాక్ చేసి అంతర్జాతీయ సరిహద్దుకు ఆరు కిలోమీటర్ల…
గత కొంతకాలంగా లద్దాఖ్ సరిహద్దుల్లో ఇండియా-చైనా దేశాల మధ్య ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నెపథ్యంలో ఇండియా తూర్పు లద్దాఖ్ లో అధునాతమైన ఆయుధాలను మోహరిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా ఇప్పుడు ఇండియన్ ఆర్మీ చేతికి ఓ అధునాతనమైన ఆయుధం లభించింది. ఫార్వార్డ్ ఏరియాల్లో తొలిసారిగా కే9 వజ్ర అనే శతఘ్నలను మోహరించారు. ఈ కే 9 వజ్ర శతఘ్నలు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న శతృ స్థావరాలను ద్వంసం చేయగల శక్తిని కలిగి…
కూతురు ఎవరికైనా కూతురే. కన్నబిడ్డకోసం తల్లిదండ్రులు ఎంత కష్టం పడటానికైనా సరే సాహసిస్తారు. తన చిన్నారిని ఎలాగైనా కాపాడుకోవాలనే తలంపుతో ఆర్మీజవాన్ ఒట్టి కాళ్లతో నడక ప్రయాణం మొదలుపెట్టాడు. సీడిఎల్ఎస్ అనే అరుదైన వ్యాధితో చిన్నారి బాధపడుతున్నది. జన్యలోపం వలన ఇలాంటి సీడిఎల్ఎస్ వ్యాధి సంభవిస్తుంది. ఈ వ్యాధికి ఇప్పటి వరకు ఎలాంటి చికిత్స లేకపోవడంతో ఎలాగైనా సరే కాపాడుకోవడానికి ఆ చిన్నారి తండ్రి బ్రాన్నింగ్ కంకణం కట్టుకున్నాడు. హోప్ ఫర్ హస్తి పేరుతో ఛారిటీని స్థాపించి…
జమ్మూకాశ్మీర్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు భద్రతా బలగాలకు శిక్షణ ఇవ్వబోతున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు వేగంగా ఆ దేశాన్ని ఆక్రమించుకున్నారు. తాలిబన్ల నుంచి ఇతర దేశాలకు ముప్పు ఉండే అవకాశం ఉందని వస్తున్న వార్తల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నది. తాలిబన్లను ఎదుర్కొనడానికి అవసరమైన శిక్షణను ఇచ్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒకవేళ తాలిబన్లు జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రచర్యలకు తెగబడితే దానిని ఎలా ఎదుర్కోవాలి, వారిని ఎలా తరిమికొట్టాని, ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి వంటి…
ఈరోజు దేశ చరిత్రలో ఓ అద్భుతం జరిగింది. విమానాల ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు హైవేలు ఎంత వరకు ఉపయోగపడతాయి అనే విషయంపై ఓ ప్రయోగాన్ని నిర్వహించారు. రాజస్థాన్‌లోని జలోర్ హైవేపై సీ 130 సూపర్ హెర్క్యులస్ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ విమానం నేషనల్‌హైవేపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ ఫీల్డ్‌పై ల్యాండ్ అయింది. రక్షణశాఖకు చెందిన ఈ ట్రాన్స్‌పోర్ట్ విమానంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్, కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కారి, ఎయిర్…
ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబన్లు కైవసం చేసుకోవడంతో అక్కడ అంతర్యుద్ధం జరుగుతున్నది. పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. ఆ దేశాధ్యక్షుడు దేశం వదిలి పారిపోయాడు. ఇక ఇదిలా ఉంటే, ఆఫ్రికాలోని గినియాలోనూ సైనికుల తిరుగుబాటు జరిగింది. దేశాన్ని సైనికులు వారి చేతిల్లోకి తీసుకున్నారు. గినియా అధ్యక్షుడు అల్ఫా కోంటేని సైనికులు అదుపులోకి తీసుకున్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేసినట్టు సైనికులు ప్రకటించారు. దేశంలో ప్రజారంజకమైన పాలన సాగిస్తామని ఆ దేశ ఆర్మీ కల్నల్ మామాడి డౌంబౌయా తెలిపారు. ఈరోజు…
తాలిబన్లు ఆఫ్ఘన్‌ను ఆక్రమించుకున్నారు. ఆగస్టు 31 తరువాత కాబూల్ ఎయిర్‌పోర్ట్ తో సహా అన్ని తాలిబన్ల వశం కాబోతున్నాయి. ఆ తరువాత ఆ దేశం పరిస్థితి ఎలా మారిపోతుంది అన్నది అందిరిలోనూ ఉన్న ప్రశ్న. తాలిబన్లను చూసి భయపడవద్దని, తాము మారిపోయామని, తాము అందరిని సమానంగా గౌరవిస్తామని చెబుతున్నారు. అయినప్పటికీ ఎవరూ నమ్మడంలేదు. ఇక ఇదిలా ఉంటే, ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ చిన్న క్లిప్ వైరల్ అవుతున్నది. తాలిబన్ ముష్కరులు ఓ టీవీ ఛానల్‌లోకి ప్రవేశించి,…
2001 నుంచి ఇరవై ఏళ్లపాటు అమెరికా లక్షల కోట్ల రూపాయలను ఆఫ్ఘనిస్తాన్‌లో సైన్యం కోసం పెట్టుబడులు పెట్టింది. విలువైన, అధునాతనమైన ఆయుధాలు సమకూర్చింది. అయినప్పటికీ కేవలం 11 రోజుల్లోనే ఆఫ్ఘన్ సేనలు తాలిబన్లకు లొంగిపోయారు అంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్ధం చేసుకొవచ్చు. మూడు లక్షలకు పైగా ఆఫ్ఘన్ సేనలు ఉన్నాయని, వారంతా బలంగా ఉన్నారని, అమెరికా సైన్యం వారికి అద్భుతమైన శిక్షణ ఇచ్చిందని సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. ఆయన చెప్పిన దానికి, అక్కడ…
ఏకే 47, రాకెట్ లాంచర్లు ఉంటేనే ఆఫ్ఘనిస్తాన్‌ను గజగజవణికిస్తున్నారు. అదే అధుతాన ఆయుధాలు, వైమానిక ఆయుధసంపత్తి ముష్కరుల చేతికి దొరికితే ఇంకేమైనా ఉన్నదా… ఆఫ్ఘన్ విషయంలో ఇప్పుడు ఇదే జరిగింది. గత 20 ఏళ్ల కాలంలో 89 బిలియన్ డాలర్లతో ఆఫ్ఘనిస్తాన్‌కు అమెరికా అధునాత ఆయుధాలు, యుద్ద విమానాలు, హెలికాఫ్టర్లు, యుద్ధ ట్యాంకులు, 11 వైమానిక స్థావరాలను సమకూర్చింది. ఎలా వీటిని వినియోగించాలో సైనికులను తర్ఫీదు ఇచ్చింది. సైనిక శిక్షణ ఇచ్చింది. ఇన్ని చేసినప్పటికీ ఎలాంటి ఉపయోగం…