అంతర్జాతీయ అవార్డు గ్రహీత, దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆదివారం జరిగిన 43వ కైరో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (CIFF), కైరో ఒపెరా హౌస్‌లో ఏఆర్ రెహమాన్‌ను సత్కరించారు. ఈ సందర్భంగా 54 ఏళ్ల రెహమాన్ ఈ అరుదైన గౌరవం అందుకోవడం సంతోషంగా ఉందని, ఈజిప్ట్‌ను సందర్శించినందుకు తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. Read Also : శివ శంకర్ మాస్టర్ మృతిపై రాజమౌళి ట్వీట్, ప్రముఖుల సంతాపం…
స్టార్ హీరోల సినిమాలకు సంగీతం అందించటం ఎంతో కష్టమని ఎంతో మంది సంగీతదర్శకులు చెబుతూ వస్తుంటారు. తాజాగా ఆ జాబితాలో ఆస్కార్ విజేత ఎ.ఆర్. రెహమాన్ కూడా చేరారు. స్టార్ హీరోల ఇమేజ్ కి తగ్గట్లు ట్యూన్స్ ఇవ్వవలసి రావటం ఎంతో వత్తిడితో కూడిన వ్యవహారం అంటుంటారు. రెహమాన్ కూడా రజనీకాంత్ చిత్రాలకు పనిచేయటం నరకమే అని చెబుతున్నాడు. రజనీకాంత్ నటించిన ‘ముత్తు, నరసింహా, బాబా, శివాజీ: ది బాస్, ఎంథిరన్, కొచ్చడయ్యాన్, లింగా, 2.0’ చిత్రాలకు…
తెలంగాణాలో నేటి నుంచి బతుకమ్మ పండుగ సంబరాలు ప్రారంభం. ఈ సందర్భంగా పలువురు సెలెబ్రిటీలు తెలంగాణాలో జరిగే ఈ ముఖ్యమైన పండగ సందర్భంగా మహిలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ‘బతుకమ్మ’ గురించి వరుస పోస్టులు చేశారు. “బతుకమ్మ శుభాకాంక్షలు. నా కుటుంబం ఇంట్లో ఈ పండగను జరుపుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళలు ఈ అందమైన పువ్వుల పండగను పాటలు, డ్యాన్సులతో జరుపుకుంటారు. కవిత అక్క ఈ సాంస్కృతిక వేడుకను ప్రోత్సహిస్తూ,…
తెలంగాణ జాగృతి రూపొందించిన బతుకమ్మ పాట “అల్లిపూల వెన్నెల” ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, దర్శకుడు గౌతమ్ మీనన్ విడుదల చేశారు. ఆస్కార్ విజేత ఎ.ఆర్.రెహమాన్ ఈ పాటకు సంగీతం అందించగా.. ప్రఖ్యాత దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించారు. తెలంగాణ ఆడపడుచుల పండుగ బతుకమ్మ మరోసారి విశ్వయవనికపై మెరవనుంది. ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ.ఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో బతుకమ్మ పాట “అల్లిపూల వెన్నెల” గా సరికొత్త సొబగులు అద్దుకుంది.…
అందమైన ప్రేమకథలను తెరకెక్కించడంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు తమిళ స్టార్ దర్శకుడు గౌతమ్ మీనన్.. ‘చెలి, ఘర్షణ, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, ఏం మాయ చేసావే’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యాడు. ప్రేమకథలతోనే కాకుండా యాక్షన్ సినిమాలతోను గౌతమ్ మీనన్ ఆకట్టుకున్నాడు. ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలకు దర్శకత్వం వహించిన ఈ దర్శకుడు.. తాజాగా తెలంగాణ జాగృతి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించిన బతుకమ్మ పాట ‘అల్లిపూల వెన్నెల’ కు…
తెలంగాణాలో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పండుగల్లో బతుకమ్మ ఒకటి. ప్రతి ఏడాది దసరా సందర్భంగా జరుపుకునే ఈ పండగను తెలంగాణ ప్రభుత్వం సైతం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి పండుగకు ముందు ‘బతుకమ్మ’ స్పెషల్ సాంగ్స్ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. చాలా మంది సంగీతకారులు విభిన్న పాటలతో యూట్యూబ్ లో బతుకమ్మను సెలబ్రేట్ చేస్తారు. అయితే మొదటిసారిగా బతుకమ్మ పాటకు సంగీతం అందించడానికి లెజెండరీ మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ ముందుకు వచ్చారు.…
ఎప్పటినుంచో వినిపిస్తున్న షారూఖ్, అట్లీ సినిమా ఎట్టకేలకు పట్టాలెక్కింది. ఇటీవల ఈ సినిమా పూణేలో ప్రారంభమైంది. ప్రస్తుతం సినిమా ప్రధాన తారాగణం పాల్గొనగా కొన్ని కీలక సన్నివేశాలను అక్కడే చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి ఇద్దరు ప్రముఖ సంగీత దర్శకులు పని చేయబోతున్నారట. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ పాటలు కంపోజ్ చేస్తుండగా, అనిరుధ్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేయబోతున్నట్లు టాక్. ఇంతకు ముందు రెహమాన్, అట్లీ కలసి ‘మెర్సల్, బిగిల్’ సినిమాలకు పని చేశారు.…
ఏఆర్ రెహ్మాన్… ఈ పేరు భారతీయులకి గర్వకారణం! మరి మైకెల్ జాక్సన్ సంగతి ఏంటి? ఆయనంటే అమెరికాకే కాదు యావత్ ప్రపంచానికి ఓ అద్భుతం! అయితే, ఏఆర్ రెహ్మాన్, మైకెల్ జాక్సన్ హిస్టారికల్ మీటింగ్ జరిగింది 2009లో! దాని గురించి స్వయంగా మన ఆస్కార్ విన్నరే వివరించాడు కూడా… గతంలో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా, మైకెల్ తో తన మీటింగ్ గురించి, రెహ్మాన్ తన జ్ఞాపకాల్ని పంచుకున్నాడు. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ తరువాత తనకి ఆస్కార్ నామినేషన్స్…
గౌతమ్ మెనన్ లాంటి దర్శకుడు, శింబు లాంటి హీరో, ఆపైన ఏఆర్ రెహ్మాన్ లాంటి సంగీత దర్శకుడు… ఓ సినిమాకి ఇంత కంటే ఇంకా పెద్ద అట్రాక్షన్స్ ఏం కావాలి? వీరు ముగ్గురు కలసి పని చేయటం ఇదే మొదటి సారి కాకపోయినా గత రెండు చిత్రాల రెస్పాన్స్ చూసిన వారికి ఎస్టీఆర్, జీవీఎం, ఏఆర్ఆర్ కాంబినేషన్ అంటే ఏంటో ఇప్పటికే ఐడియా ఉంటుంది! శింబుతో గతంలో గౌతమ్ మెనన్ ‘విన్నయ్ తాండి వరువాయా, అచ్చం యెన్బదు…
ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ “99 సాంగ్స్” చిత్రంతో స్క్రీన్ రైటర్‌గా మారారు. ఆయనే ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. “99 సాంగ్స్”లో ఇహన్ భట్, ఎడిల్సీ వర్గాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. దీనికి విశ్వేష్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం హిందీ, తమిళ, తెలుగు వెర్షన్లు ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్, జియో సినిమాల్లో ప్రసారం అవుతున్నాయి. ఇటీవలే సినిమాను చూసిన లెజెండరీ సింగర్ పి. సుశీల ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. అంతేకాదు తన…