Rajinikanth Done Dubbing Works For Baba Re Release: సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘బాబా’ సినిమా రీ-రిలీజ్ అంటూ గత కొన్ని రోజులగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగతోంది. ఈ విషయమై అభిమానులు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్స్‌లో క్రేజ్ కూడా నెలొంది. రజనీకాంత్ పుట్టినరోజున ఒక షో రిలీజ్‌గా ప్రారంభమైన ఈ సినిమా ఇప్పుడు రీ-రిలీజ్ సంచలనం సృష్టిస్తోంది. దాంతో తమిళనాడులోనే కాకుండా ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్‌లో కూడా పలు థియేటర్లలో రిలీజ్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి.
డిజిటల్ మిక్సింగ్ కూడా చేసి సాంకేతికంగా అప్‌డేట్ చేశారు. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కూడా ప్రీవ్యూ వేసుకుని మరీ ఏయే మార్పులు చేస్తే బాగుంటుందో చూసి వాటిని కరెక్ట్ చేయటం విశేషం. ఇక రజనీకాంత్ కొత్త ఎడిట్‌లో కొన్ని సన్నివేశాలకు డబ్బింగ్ కూడా చెప్పటం మరీ విశేషం. రజనీకాంత్‌తో పాటు దర్శకుడు సురేశ్ కృష్ణ ‘బాబా’ రీ-రిలీజ్‌కి వచ్చిన హైప్‌పై ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.