AR Rahman: అందరి ఊహలని తలకిందులు చేశారు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ సినిమాకి ఆస్కార్ రావాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు కానీ చాలా మంది భారతీయులకి ఆస్కార్ అవార్డ్ గురించి తెలిసేలా చేసిన మొదటి టెక్నిషియన్ ‘ఏఆర్ రెహమాన్’. స్లమ్ డాగ్ మిలియనేర్ సినిమాకి ఆస్కార్ అవార్డ్ గెలుచుకోని కొత్త చరిత్ర సృష్టించిన రెహమాన్, ఎంతోమంది ఆస్కార్ అవార్డ్ ఇండియన్ కూడా గెలవొచ్చు అని తెలిసేలా చేశాడు. 2009లో బెస్ట్ ఒరిజినల్ స్కోర్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిల్లో రెహమాన్ ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డుని కూడా గెలుచుకున్నాడు. స్లమ్ డాగ్ మిలియనేర్ సినిమాకి గాను రెహమాన్ ఈ అవార్డుని అందుకున్నాడు. దాదాపు పుష్కరం తర్వాత మరో ఇండియన్ గోల్డెన్ గ్లోబ్ అవార్డుని అందుకున్నాడు. జక్కన్న చెక్కిన మాస్టర్ పీస్ ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాకి సూపర్బ్ సాంగ్స్ ఇచ్చిన ‘కీరవాణి’ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో గోల్డెన్ గ్లోబ్ అవార్డుని గెలుచుకున్నాడు. ఒక ఇండియన్ సినిమాకి, ఒక ఇండియన్ టెక్నిషియన్ కి ఇంటర్నేషనల్ వేదికపై అవార్డ్ రావడంతో రెహమన్ ట్వీట్ చేశాడు. “Incredible ..Paradigm shift Congrats Keeravani Garu from all Indians and your fans! Congrats ssrajamouli Garu and the whole RRR team!” అంటూ రెహమాన్ ట్వీట్ చేశాడు. నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్ కూడా వెళ్లే ఛాన్స్ ఉంది కాబట్టి అక్కడ కూడా అవార్డ్ సాదిస్తే, ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా కొత్త చరిత్ర సృష్టించినట్లే..
Incredible ..Paradigm shift🔥👍😊👌🏻 Congrats Keeravani Garu 💜from all Indians and your fans! Congrats @ssrajamouli Garu and the whole RRR team! https://t.co/4IoNe1FSLP
Also Read
— A.R.Rahman (@arrahman) January 11, 2023
తాజావార్తలు
-
Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!