తెలుగు ఇండియన్ ఐడిల్ తుది దశకు చేరుకుంది. ఆరుగురు కంటెస్టెంట్స్ తో జరిగే సెమీ ఫైనల్ కు బాలకృష్ణ గెస్ట్ గా రాబోతున్నారు. దీనికి సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తయ్యింది. ఇది జూన్ 10వ తేదీ ప్రసారం కానుంది. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. బాలకృష్ణ ‘నేను జడ్జిని కాదు… వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చిన కంటెస్టెంట్స్ ను’ అంటూ తోటి కంటెస్టెంట్స్ లో హుషారు…
ఆది నుంచి ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఐపీఎల్ సీజన్ 2022 చివరి దశకు చేరుకుంది. ఈ సీజన్లో జట్ల మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లు సాగింది. అయితే నిన్న రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడి నెగ్గింది. దీంతో ఫైనల్లో గుజరాత్‌తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం రాత్రి 8 గంటలకు ఐపీఎల్ 2022 సీజన్ ఫైనల్ మ్యాచ్…
గ్రామీ అవార్డులు 2022 వేడుక ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ సంవత్సరం ఈ వేడుక లాస్ వెగాస్‌లోని MGM గ్రాండ్ గార్డెన్ అరేనాలో జరిగింది. సినీ పరిశ్రమలోని ప్రముఖులు అత్యంత ఆకర్షణీయమైన అవతార్లలో రెడ్ కార్పెట్ పై కన్పించారు. ఈ సంవత్సరం కూడా ట్రెవర్ నోహ్ హోస్ట్‌గా వ్యవహరించాడు. ఆసియా నుంచి ఈ వేడుకలకు హాజరైన ప్రముఖ సంగీత దిగ్గజాలలో ఏఆర్ రెహమాన్ కూడా ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.…
మ్యూజిక్ దిగ్గజాలు ఏఆర్ రెహమాన్, ఇసైజ్ఞాని ఇళయరాజా తాజాగా దుబాయ్‌లో ఒకరినొకరు కలుసుకున్నారు. ఈ జంట చాలా మంది సంగీతకారులకు హాట్ ఫేవరెట్ అన్న విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళ్తే… దుబాయ్ లో ఉన్న మాస్ట్రో రెహమాన్ స్టూడియో ఫిర్దౌస్ ని ఆదివారం ఇళయరాజా సందర్శించారు. ఎఆర్ రెహమాన్ ట్విట్టర్లో మ్యూజిక్ లెజెండ్‌తో కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. “మా ఫిర్దౌస్ స్టూడియోకి మాస్ట్రో ఇళయరాజాను స్వాగతించడం చాలా ఆనందంగా ఉంది… భవిష్యత్తులో మా ఫిర్దౌస్…
కోలీవుడ్ హీరో శింబు బర్త్ డే నేడు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న నెక్స్ట్ మూవీ నుంచి శింబు అభిమానులకు పవర్ ఫుల్ గ్లింప్స్ తో శింబు బర్త్ డే ట్రీట్ ఇచ్చారు మేకర్స్. శింబు (సిలంబరసన్ థెసింగు రాజేందర్) ప్రస్తుతం “పాతు తల” అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా విడుదల చేసిన ఈ సినిమా గ్లింప్స్ ఆసక్తికరంగా ఉంది. గ్లింప్స్ చూస్తుంటే ఈ మూవీ పొలిటికల్ డ్రామా అన్పిస్తోంది. ఇందులో శింబు పవర్ ఫుల్ రోల్…
‘ది మొజార్ట్ ఆఫ్ మద్రాస్’ అని మ్యూజిక్ ప్రియులు లవర్స్ పిలుచుకునే దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌కి నేటితో 55 ఏళ్లు. ఆయన తన మనోహరమైన సంగీతంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులను అలరించారు. భారత ప్రభుత్వం ఆయన చిత్రపరిశ్రమకు చేసిన కృషికి గానూ దేశంలోని మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌ను అందించి గౌరవించింది. రెహమాన్ అందుకున్న అవార్డులలో ఆరు జాతీయ చలనచిత్ర అవార్డులు, రెండు అకాడమీ అవార్డులు, రెండు గ్రామీ అవార్డులు, ఒక…
ఆస్కార్ అవార్డు మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఇంట్లో తాజాగా వేడుక జరిగింది. ఏఆర్ రెహమాన్ కుమార్తె ఖతీజా రెహమాన్ నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని ఖతీజా స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. జనవరి 2న రియాస్దీన్ షేక్ మొహమ్మద్‌తో నిశ్చితార్థం చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ సంతోషకరమైన వార్తను ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించి, ప్రపంచానికి తనకు కాబోయే భర్తను కూడా పరిచయం చేసింది. రెహమాన్ తన ఇన్స్టాగ్రామ్ కథనాలలో ఖతీజా పోస్ట్‌ను పంచుకున్నారు.…
అంతర్జాతీయ అవార్డు గ్రహీత, దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆదివారం జరిగిన 43వ కైరో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (CIFF), కైరో ఒపెరా హౌస్‌లో ఏఆర్ రెహమాన్‌ను సత్కరించారు. ఈ సందర్భంగా 54 ఏళ్ల రెహమాన్ ఈ అరుదైన గౌరవం అందుకోవడం సంతోషంగా ఉందని, ఈజిప్ట్‌ను సందర్శించినందుకు తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. Read Also : శివ శంకర్ మాస్టర్ మృతిపై రాజమౌళి ట్వీట్, ప్రముఖుల సంతాపం…
స్టార్ హీరోల సినిమాలకు సంగీతం అందించటం ఎంతో కష్టమని ఎంతో మంది సంగీతదర్శకులు చెబుతూ వస్తుంటారు. తాజాగా ఆ జాబితాలో ఆస్కార్ విజేత ఎ.ఆర్. రెహమాన్ కూడా చేరారు. స్టార్ హీరోల ఇమేజ్ కి తగ్గట్లు ట్యూన్స్ ఇవ్వవలసి రావటం ఎంతో వత్తిడితో కూడిన వ్యవహారం అంటుంటారు. రెహమాన్ కూడా రజనీకాంత్ చిత్రాలకు పనిచేయటం నరకమే అని చెబుతున్నాడు. రజనీకాంత్ నటించిన ‘ముత్తు, నరసింహా, బాబా, శివాజీ: ది బాస్, ఎంథిరన్, కొచ్చడయ్యాన్, లింగా, 2.0’ చిత్రాలకు…
తెలంగాణాలో నేటి నుంచి బతుకమ్మ పండుగ సంబరాలు ప్రారంభం. ఈ సందర్భంగా పలువురు సెలెబ్రిటీలు తెలంగాణాలో జరిగే ఈ ముఖ్యమైన పండగ సందర్భంగా మహిలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ‘బతుకమ్మ’ గురించి వరుస పోస్టులు చేశారు. “బతుకమ్మ శుభాకాంక్షలు. నా కుటుంబం ఇంట్లో ఈ పండగను జరుపుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళలు ఈ అందమైన పువ్వుల పండగను పాటలు, డ్యాన్సులతో జరుపుకుంటారు. కవిత అక్క ఈ సాంస్కృతిక వేడుకను ప్రోత్సహిస్తూ,…