ఇండియన్ సినిమా సెలబ్రిటీలు, ముఖ్యంగా, బాలీవుడ్ జనాలు హాలీవుడ్ ఐకాన్స్ గురించి చాలా సార్లు మాట్లాడుతుంటారు. తమ అభిమాన నటుడు, నటీ అంటూ కొందరి పేర్లు చెబుతుంటారు. ఇక మన సెలబ్స్ కు వెస్ట్రన్ సింగర్స్ అన్నా అభిమానం ఎక్కువే. చాలా మంది పాశ్చాత్య పాప్ సింగర్స్ కి మన దగ్గర బోలెడు మంది వీఐపీ ఫ్యాన్స్ ఉన్నారు. కానీ, ఏఆర్ రెహ్మాన్ విషయంలోనూ సీన్ రివర్స్ అనే భావించాలి…ఆస్కార్ గెలిచిన మన ఇండియన్ మ్యూజికల్ వండర్…
ప్రముఖ నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్, ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ కాంబినేషన్లో రూపొందిన ప్రేమకథా చిత్రం ‘99 సాంగ్స్’. ఇహాన్ భట్, ఎడిల్సీ జంటగా నటించారు. విశ్వేష్ కృష్ణమూర్తి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏప్రిల్ 16న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. నెట్ఫ్లిక్స్లో మే 21 నుంచి హిందీ, తమిళం, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.