కడప ‘అమీన్ పీర్ దర్గా’ ఉరుసు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉస్తవాల్లో రెండో రోజు కీలక ఘట్టం ‘గంధం’ నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో పీఠాధిపతి ‘ఆరిపుల్లా హస్సాని’ ఇంటి నుంచి మెరవాని మధ్య గంధం సమర్పించారు. దర్గాలో మాజర్ల వద్ద గంధం ఉంచి ప్రత్యేక ప్రార్థనలు చేసారు పీఠాధిపతి అరీపులా హుస్సేని. 08-12-2022 గురువారం రాత్రికి ముషాయిరా హాల్లో ఖవ్వాలి ఏర్పాటు చేశారు. ఘనంగా జరుగుతున్న ఈ ఉరుసు ఉత్సవాలకి కొన్నేళ్లుగా ఏ అర్ రెహమాన్ క్రమం తప్పకుండా దర్గా ‘ఉరుసు గంధం’లో పాల్గొని, ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు.
ఆరు నేషనల్ అవార్డులు, రెండు అకాడెమీ అవార్డులు, 15 ఫిల్మ్ ఫేర్ అవార్డులు గెలుచుకున్న రెహమాన్, తన 23 ఏళ్ల వయసులో కుటుంబంతో సహా మతం మార్చుకున్నాడు. అప్పటినుంచి ఎఆర్ రెహమాన్ కడప దర్గాకి వచ్చి వెళ్తుంటాడు. ఇక ఫిల్మ్ కెరీర్ విషయానికి వస్తే, ‘మణిరత్నం’ తెరకెక్కించిన ‘రోజా’ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా మారిన రెహమాన్, ఇండియాలో టాప్ కంపోజర్ గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం రెహమాన్ ‘పోన్నియిన్ సెల్వన్ 2’, ‘ఆడుజీవితం’, ‘అయలాన్’, ‘మైదాన్’, ‘మా మన్నన్’ సినిమాలకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.