యూపీఏ.. కాంగ్రెస్ సారథ్యంలో పదేళ్లపాటుదేశాన్ని ఏలిన ఐక్య ప్రగతిశీల కూటమి. 19 ఏళ్లుగా ఆ కూటమిని కాంగ్రెస్ లీడ్ చేసింది. అయితే ఇకపై ఈ పేరు కనుమరుగు కాబోతోందని జాతీయ రాజకీయాల్లో టాక్ నడుస్తోంది.
Arvind Kejriwal: ‘మోదీ ఇంటి పేరు’ వ్యాఖ్యలపై సూరత్ కోర్టు ఈ రోజు కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీకి రెండేళ్లు శిక్షను విధించింది. ఆ తరువాత 30 రోజలు పాటు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. పైకోర్టుకు అప్పీల్ చేసుకునే అవకాశం ఇచ్చింది. అయితే ఈ కేసుపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. కుట్రతో బీజేపీ నాయకులు విపక్షాలను భయపెడుతోందని, గుజరాత్, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని ఆయన…
Parliament: ప్రతిపక్ష ఎంపీలపై రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖర్ సీరియస్ అయ్యారు. సభా నియమాలను, సభా హక్కులను ఉల్లంఘించారనే ఆరోపణల నేపథ్యంలో 12 మంది ప్రతిపక్ష ఎంపీల పేర్లను రాజ్యసభ ప్రివిలేజెస్ కమిటీకి సిఫారసు చేశారు. ఇందులో 9 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉండగా, ముగ్గురు ఆప్ ఎంపీలు ఉన్నారు. కమిటీ పరిశీలించి, దర్యాప్తు చేసి నివేదికను సమర్పించాలని జగ్‌దీప్ ధన్‌ఖర్ ఆదేశించారు. దీనికి అనుగుణంగా ఎంపీలపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
Delhi Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో ఇంటినుంచి అడుగు బయట పెట్టాలంటేనే రాజధానివాసులు జంకుతున్నారు.
Delhi Assembly special session: ఢిల్లీ అసెంబ్లీ ఒక రోజు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసింది. శుక్రవారం ఢిల్లీ అసెంబ్లీ సమావేశం అయింది. ప్రస్తుతం ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న రాజకీయం నేపథ్యంలో, ఎమ్మెల్యేల కొనుగోలు విమర్శల నేపథ్యంలో ఈ అసెంబ్లీ సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. బుధవారం ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది. ఢిల్లీలో ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ రూ.800 కోట్లను సిద్ధం చేసిందని
గూగుల్ ప్లేస్టోర్‌లో ప్రతిరోజూ కొన్ని వందల కొత్త యాప్‌లు రిజిస్టర్ అవుతుంటాయి. అందులో కొన్ని యాప్‌లు వినియోగించుకోవడానికి, డైలీ లైఫ్ లో వాడుకోవడానికి వీలుగా ఉంటాయి. కొన్ని యాప్‌లు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం, కొన్ని యాప్‌లు సరదాగా గేమ్‌లు వంటివి ఆడుకోవడానికి ఉపయోగపడుతుంటాయి. ప్రతీ ఏడాది గూగుల్ ప్లే స్టోర్ లో బెస్ట్ యాప్స్ ఏమున్నాయి అనే దానిపై సర్వేను నిర్వహిస్తుంది. యూజర్ సర్వే ఆధారంగా బెస్ట్ యాప్స్ ఏంటో ప్రకటించి వాటికి అవార్డులు అందజేస్తుంటుంది. 2021 యూజర్…
తెలియని ఫోన్ నెంబర్‌తో కాల్ వస్తే అది ఎక్కడి నుంచి వచ్చింది ఎవరి పేరుతో ఉన్నది అని తెలుసుకునేందుకు కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూకాలర్‌ను వినియోగిస్తుంటారు. 11 ఏళ్ల క్రితం ఈ యాప్ ప్రారంభం అయింది. ఇప్పటి వరకు మొత్తం 30 కోట్ల మంది యూజర్లను సొంతం చేసుకుంది. గతేడాది వరకు 25 కోట్ల మంది యూజర్లు ఉండగా, ఏడాది కాలంలో మరో 5 కోట్ల మంది కొత్త యూజర్లు యాడ్ అయినట్టు ట్రాకాలర్ యాప్ తెలియజేసింది.…
ఆనందయ్య మందు పంపిణీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తయారీ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపటి నుంచి మందు తయారీ జరుగనున్నది. దీంతో ఈ రోజు కలెక్టర్‌తో ఆనందయ్య సమావేశం అయ్యారు. మందు పంపిణీపై చర్చించారు. కృష్ణపట్నం ఎవరూ రవొద్దని, ఆన్‌లైన్ లో మందు పంపిణీ చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ఆన్‌లైన్ లో మందు పంపిణీకి మొబైల్ యాప్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. పంపిణీకి మరో 5 రోజుల సమయం పడుతుందని అందరికీ తప్పకుండా మందు పంపిణీ…