Delhi Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో ఇంటినుంచి అడుగు బయట పెట్టాలంటేనే రాజధానివాసులు జంకుతున్నారు. పంట పొలాల్లో కాలుస్తున్న వ్యర్థాలు ప్రజలను కలవరపెడుతున్నాయి. ప్రస్తుతం 472 దగ్గర ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉంది. దీంతో ఢిల్లీలో మాస్క్ లేకుండా తిరగలేని పరిస్థితి ఏర్పడింది. గాలి నాణ్యత రోజురోజుకు క్షీణిస్తుండటంతో కాలుష్య నివారణకు ఆప్ ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా డీజిల్ వాహనాలపై పలు ఆంక్షలు విధించింది. అత్యవసర, నిత్యావసర వస్తువులను తరలించే వాహనాలు మినహా, మిగతా డీజిల్ వాహనాలు నగరంలోకి రాకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.20 వేల వరకు జరిమానా విధిస్తామని ఢిల్లీ రవాణా శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. బీఎస్ 3 పెట్రోల్, బీఎస్ 4 డీజిల్ వాహనాలకు మాత్రం ఢిల్లీలోకి ఎంట్రీ లేదని స్పష్టం చేశారు. ప్రజా రవాణా కోసం 1000 సీఎన్ జీ బస్సులను అద్దెకు తీసుకోనున్నట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు.
Read Also: Ramcharan: మెగా ఫ్యాన్స్కు పూనకాలే.. హాలీవుడ్కు రామ్ చరణ్
ఇది ఇలా ఉండగా కాలుష్యం తగ్గేంతవరకు కొంత కాలం స్కూళ్లను మూసివేయాలని కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆన్ లైన్ క్లాసులు నిర్వహించుకోవాలని అధికారులు తెలిపారు. పరిస్థితులు మెరుగుపడేదాకా ప్రైమరీ స్కూల్స్ క్లోజ్ చేయాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో 50 శాతం మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని ఆదేశించింది. రోడ్లు వేయడం, బ్రిడ్జిల నిర్మాణం, పెద్ద ప్రాజెక్టుల పనుల్ని ఆపేయాలని ఆదేశించింది. ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలో రోజురోజుకు గాలి నాణ్యత పడిపోతుంది. యూపీలోని నోయిడా 562తో తీవ్రస్థాయిలో ఉంది. గురుగ్రామ్ 539,ఢిల్లీ యూనివర్సిటీ సమీపంలో 572 ఉంది. ప్రస్తుతం గాలి నాణ్యత ఢిల్లీలో 472గా ఉంది.
These are Not Forest Fires of California or Australia Nor Even #Diwali crackers. Just Nice Arvind Kejriwal sponsored Environment, Judiciary, Media & Climate Friendly Stubble Fires Burning in Punjab causing Breathtaking Pollution in Delhi #DELHIPOLLUTION #KejriwalResign pic.twitter.com/qQSNFSj1tz
— Rosy (@rose_k01) November 4, 2022