ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఎట్టకేలకు ప్రభుత్వ బంగ్లా కేటాయించబడింది. ఏడాది తర్వాత కొత్త బంగ్లాను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నవంబర్ 4, 2024న ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేశారు. వాస్తవంగా 10 రోజుల్లోనే జాతీయ అధ్యక్షుడికి ఢిల్లీలో అధికారికంగా ప్రభుత్వ బంగ్లాను ఏర్పాటు చేయాలి..
దేశ వ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. గుజరాత్, కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్‌లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు వచ్చాయి. గుజరాత్‌లో రెండు స్థానాలకు బైపోల్స్ జరిగాయి.
ఢిల్లీలో ఉత్కంఠకు తెరపడింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజం చేస్తూ కమలం వికసించింది. ఆప్ కు పట్టున్న ప్రాంతాల్లో కూడా బీజేపీ అభ్యర్థులు విజయం సాధించటం.. ఆ పార్టీ వ్యూహానికి అద్దం పడుతోంది. ఆప్ దిగ్గజాల్ని ఓటమి బాట పట్టించిన ఢిల్లీ ఓటర్లు.. కాషాయ పార్టీకి రాచబాట వేశారు. ఢిల్లీ అభివృద్ధికి గ్యారంటీ ఇచ్చిన మోడీ.. ఉచిత పథకాల విషయంలోనూ తగ్గలేదు. మరిప్పుుడు బీజేపీ ఎలాంటి పాలనా విధానం తీసుకొస్తుందనేది చూడాల్సి ఉంది.
వచ్చే ఏడాదే దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి కొత్త ఊపు వచ్చింది. ఆప్ అభ్యర్థి మహేశ్‌కుమార్ ఖిచి జయకేతనం ఎగరేశారు.
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్ అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. శుక్రవారం అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి ఆప్ పార్టీ నేత ఇంట్లోకి మకాం మార్చారు. ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్ నివాసాన్ని ఖాళీ చేసి లుటియన్స్ జోన్‌లోని కొత్త చిరునామాకు మారారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను లెఫ్టినెంట్ గవర్నర్ వీకే.సక్సేనాకు సమర్పించారు. అతిషితో కలిసి కేజ్రీవాల్ మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. అనంతరం కేజ్రీవాల్ రిజైన్ లెటర్.. వీకే.సక్సేనాకు అందజేశారు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్-కాంగ్రెస్ మధ్య పొత్తు కుదరనట్లుగా తెలుస్తోంది. ఇరు పార్టీల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగినా సఫలీకృతం కాలేదు. దీంతో ఒంటరిగానే బరిలోకి దిగాలని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
హర్యానాలో కాంగ్రెస్-ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య సీట్ల పంపకం పంచాయితీ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం ఇరు పార్టీల నేతలు సుదీర్ఘ మంతనాల తర్వాత సీట్ల పంపకాలు జరిగినట్లుగా సమాచారం అందుతోంది. ఆప్ 10 సీట్లు అడగ్గా.. ఐదు నుంచి ఏడు సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బీజేపీలో చేరిన ఢిల్లీలోని ఐదుగురు కౌన్సిలర్లలో ఒకరైన కౌన్సిలర్ రామచంద్ర ఈరోజు తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. మూడు రోజుల క్రితం ఆప్ కౌన్సిలర్‌లను తమ పార్టీలో చేర్చుకోవాలని మాయ చేసిన బీజేపీకి గురువారం గట్టి ఎదురుదెబ్బ తగిలిందని ఆమ్ ఆద్మీ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.