Meenakshi Lekhi: రెజ్లర్ల నిరసనపై మీడియా ప్రశ్నలు.. పరుగు పెట్టిన కేంద్రమంత్రి మీనాక్షీ లేఖి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meenakshi Lekhi: భారత రెజ్లర్ల సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై మహిళా రెజ్లర్లు లైంగిక ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేయాలని, పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటికే బ్రిజ్ శరణ్ పై రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు. అయితే ఈ వివాదంపై కేంద్ర మంత్రి మీనాక్షి లేఖిని మీడిాయా ప్రశ్నించింది. అయితే ఆమె సమాధానం చెప్పకుండా పరిగెత్తుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read Also: Hyderabad : వేధిస్తున్నాడని భర్తను అతి దారుణంగా నరికి చంపిన భార్య..
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
కేంద్రమంత్రి తన కారువైపు వెళ్తూ ఈ సమస్యపై చట్టపరమైన ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు. అయితే ఈ కేంద్రమంత్రిపై, బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్, ఆప్ పార్టీలు విరుచుకపడ్డాయి. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) సిగ్గులేని మంత్రి అని వ్యాఖ్యానించింది. రెజ్లర్లకు సంబంధించిన ప్రశ్న విని సిగ్గులేని మంత్రి మీనాక్షి లేఖీ పారిపోయారని తన ట్విట్టర్ హ్యాండిల్ లో ఆప్ విమర్శించింది. ఆమె పరుగెత్తుతున్న వీడియోను కాంగ్రెస్ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.
ఇదిలా ఉంటే మంగళవారం రెజ్లర్లు తమ పతకాలను గంగా నదిలో కలిపేందుకు హరిద్వార్ వెళ్లారు. అయితే రైతు సంఘాల నేతలు వారించడంతో వెనక్కి తగ్గారు. వారి డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వానికి 5 రోజులు అల్టిమేటం ఇచ్చారు. మరోవైపు దీనిపై ఆరోపణలు ఎదుర్కొంటున్న డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ స్పందించారు. వీరు గంగాలో పతకాలు పడేస్తామని వెళ్లి రాకేష్ టికాయత్ కు ఇచ్చారని ఎద్దేవా చేశారు. తనపై విచారణ జరుగుతోందని ఆయన అన్నారు. దోషిగా తేలితే ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని సింగ్ వెల్లడించారు.
महिला पहलवानों के मुद्दे पर केंद्रीय मंत्री मीनाक्षी लेखी ने दी तीखी प्रतिक्रिया
आप खुद देखें 👇 pic.twitter.com/9XqyJcwmgD
— Congress (@INCIndia) May 30, 2023
पहलवानों से जुड़े सवाल को सुनकर सरपट भागी 'बेशर्म मंत्री' मीनाक्षी लेखी
पत्रकार: "आप महिला सांसद हैं" आप पहलवानों के मुद्दे पर चुप क्यों हैं, और "प्रधानमंत्री क्यों चुप हैं" ?
Meenakshi Lekhi: 🏃♀️🏃♀️🏃♀️🏃♀️ pic.twitter.com/h5pVMPJC3e
— AAP (@AamAadmiParty) May 31, 2023
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!