వానాకాలం ముగిసి శీతాకాలం ఎంటర్ అయినప్పటికి వరుణుడు మాత్రం వదలనంటున్నాడు. గత కొన్ని రోజుల క్రితం మొంథా తుఫాన్ ఏపీ, తెలంగాణలో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. కుండపోత వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లాయి. భారీ వరదలతో లోతట్టు ప్రాంత్రాలు జలమయమయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లు ధ్వంసం అయ్యాయి. ఆ తుఫాన్ ప్రభావం వీడి రోజులు గడవకముందే నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం బయపెడుతోంది. Also Read:Andhra Pradesh:విశాఖలో మేనేజ్…
రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌కు స్పీకర్ చింతకాయల ఆయ్యన్న పాత్రుడు చురకలు అంటించారు. ఆక్రమించిన స్థలాల్లో లే అవుట్స్ వేస్తుంటే ఏం చేస్తున్నారని మంత్రిని స్పీకర్ ప్రశ్నించారు. స్టేజ్‌ల మీద ఉపన్యాసాలు ఇస్తే కుదరదని, నియంత్రణ ఉండాలన్నారు. పదవులు, అధికారం శాశ్వతం అని ఎవరు అనుకోవద్దని.. మన హయాంలో ఏం చేశామో అదే ముఖ్యం అని పేర్కొన్నారు. ఒకే ప్రభుత్వం కలకాలం ఉంటుందని అనుకోవద్దని స్పీకర్ ఆయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరడ్కో ప్రాపర్టీ షోలో…
దేశానికి గ్రోత్ ఇంజన్‌గా ఏపీ, ఏపీకి గ్రోత్ కారిడార్‌గా విశాఖ తయారవుతున్నాయని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. అమరావతి నిర్మాణం, విశాఖ అభివృద్ధిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేగంగా చేస్తున్నారన్నారు. ఏపీకి వచ్చే పెట్టుబడులకు అనుమతులు, భూములు కేటాయించి త్వరితగతిన ఉత్పత్తి దశకు చేరుకునేలా చేయూత ఇస్తున్నామన్నారు. ఏపీలో, కేంద్రంలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెడితే వాటిని ప్రభుత్వ పెట్టుబడులుగా భావించి వారందరికీ అండగా నిలుస్తున్నామని…
అగ్రరాజ్యం అమెరికాలో మరో విషాదం చోటుచేసుకుంది. ఆంధప్రదేశ్‌కు చెందిన 23 ఏళ్ల యార్లగడ్డ రాజ్యలక్ష్మి అనే విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.
ఇవాళ తాడేపల్లి నుంచి బెంగుళూరుకు మాజీ సీఎం వైఎస్ జగన్.. ఉదయం 11.05 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి 11.35 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న జగన్.. మధ్యాహ్నం 2.40 గంటలకు బెంగుళూరులోని తన నివాసానికి చేరుకోనున్న జగన్ నేడు విజయవాడ నగరానికి రానున్న మహిళల ఇండియన్ క్రికెట్ టీమ్ క్రీడాకారిణి శ్రీ చరిణి.. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి భారీ ర్యాలీ ఉదయం 10 గంటలకు సీఎం చంద్రబాబుని కలవనున్న ఉమెన్ క్రికెటర్ శ్రీచరణి..…
మొంథా తుఫాన్ ప్రభావంతో విశాఖ తీరం వెంబడి ఈదురు గాలులు బలంగా వీస్తున్నాయి. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. తుఫాన్ ప్రభావంతో విశాఖలో వర్షం మొదలైంది. మొంథా తుఫాను బలహీనపడి.. తీవ్ర అల్పపీడనంగా మారింది. రానున్న 24 గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. తుఫాను ప్రభావం పూర్తిగా తొలిగేవరకు నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరికలుజారీ చేశారు. మొంథా తుఫాను ప్రభావంతో…
మొంథా తుఫాన్ తీరం దాటిన అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది బీచ్ వద్ద సముద్రం అల్లకల్లోలంగా ఉంది. రెండు మీటర్ల ఎత్తులో కెరటాలు ఎగసిపడుతూ లైట్‌హౌస్‌ని తాకుతున్నాయి. రాజోలు ప్రాంతంలో ఉదయం నుంచి భారీ ఈదురు గాలులు వర్షం కొనసాగుతున్నాయి. నిన్నటి నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల రోడ్లపై పడిన చెట్లను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తొలగిస్తున్నారు. పల్లిపాలెం గ్రామం జలమయం కావడంతో మత్స్యకార కుటుంబాలు పునరావాస కేంద్రాల్లోనే గడుపుతున్నారు. జిల్లా…
కల్తీ మద్యం కేసులో తన ప్రమేయం లేదని విజయవాడ కననదుర్గమ్మ గుడిలో మాజీ మంత్రి జోగి రమేశ్ ప్రమాణం చేశారు. ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి గుడికి వచ్చిన ఆయన.. కననదుర్గమ్మ అమ్మవారి ఎదుట సత్యప్రమాణం చేశారు. ఘాట్ రోడ్డు ఎంట్రెన్స్ వద్ద చేతిలో దివ్వెను వెలిగించుకున్న జోగి రమేశ్.. కల్తీ మద్యం కేసులో తనకే సంబంధం లేదన్నారు. మద్యం కేసులో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, తన మనసు బాధ కలిగించారన్నారు. ‘జోగి రమేష్ అనే…
వీధి కుక్కల బెడదపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. వీధి కుక్కల సమస్యపై అఫిడవిట్ దాఖలు చేయని రాష్ట్రాలపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
‘మొంథా’ తుపాను ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తోంది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఈరోజు నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశముంది. మంగళవారం రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని ఐఎండీ అంచనా వేసింది. తుపాన్ ప్రభావం ఇప్పటికే కాకినాడలో మొదలైంది. సముద్రం దగ్గర వాతావరణం పూర్తిగా మారింది. భారీ ఈదురు గాలులు వీస్తున్నాయి. ఇక తుఫాను ప్రభావంతో నెల్లూరులోని ఉదయగిరి-కావలి ప్రాంతాలలో తేలికపాటి వర్షం మొదలైంది. తుమ్మలపెంట సముద్ర తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి.…