అగ్రరాజ్యం అమెరికాలో మరో విషాదం చోటుచేసుకుంది. ఆంధప్రదేశ్‌కు చెందిన 23 ఏళ్ల యార్లగడ్డ రాజ్యలక్ష్మి అనే విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.
ఇవాళ తాడేపల్లి నుంచి బెంగుళూరుకు మాజీ సీఎం వైఎస్ జగన్.. ఉదయం 11.05 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి 11.35 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న జగన్.. మధ్యాహ్నం 2.40 గంటలకు బెంగుళూరులోని తన నివాసానికి చేరుకోనున్న జగన్ నేడు విజయవాడ నగరానికి రానున్న మహిళల ఇండియన్ క్రికెట్ టీమ్ క్రీడాకారిణి శ్రీ చరిణి.. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి భారీ ర్యాలీ ఉదయం 10 గంటలకు సీఎం చంద్రబాబుని కలవనున్న ఉమెన్ క్రికెటర్ శ్రీచరణి..…
మొంథా తుఫాన్ ప్రభావంతో విశాఖ తీరం వెంబడి ఈదురు గాలులు బలంగా వీస్తున్నాయి. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. తుఫాన్ ప్రభావంతో విశాఖలో వర్షం మొదలైంది. మొంథా తుఫాను బలహీనపడి.. తీవ్ర అల్పపీడనంగా మారింది. రానున్న 24 గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. తుఫాను ప్రభావం పూర్తిగా తొలిగేవరకు నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరికలుజారీ చేశారు. మొంథా తుఫాను ప్రభావంతో…
మొంథా తుఫాన్ తీరం దాటిన అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది బీచ్ వద్ద సముద్రం అల్లకల్లోలంగా ఉంది. రెండు మీటర్ల ఎత్తులో కెరటాలు ఎగసిపడుతూ లైట్‌హౌస్‌ని తాకుతున్నాయి. రాజోలు ప్రాంతంలో ఉదయం నుంచి భారీ ఈదురు గాలులు వర్షం కొనసాగుతున్నాయి. నిన్నటి నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల రోడ్లపై పడిన చెట్లను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తొలగిస్తున్నారు. పల్లిపాలెం గ్రామం జలమయం కావడంతో మత్స్యకార కుటుంబాలు పునరావాస కేంద్రాల్లోనే గడుపుతున్నారు. జిల్లా…
కల్తీ మద్యం కేసులో తన ప్రమేయం లేదని విజయవాడ కననదుర్గమ్మ గుడిలో మాజీ మంత్రి జోగి రమేశ్ ప్రమాణం చేశారు. ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి గుడికి వచ్చిన ఆయన.. కననదుర్గమ్మ అమ్మవారి ఎదుట సత్యప్రమాణం చేశారు. ఘాట్ రోడ్డు ఎంట్రెన్స్ వద్ద చేతిలో దివ్వెను వెలిగించుకున్న జోగి రమేశ్.. కల్తీ మద్యం కేసులో తనకే సంబంధం లేదన్నారు. మద్యం కేసులో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, తన మనసు బాధ కలిగించారన్నారు. ‘జోగి రమేష్ అనే…
వీధి కుక్కల బెడదపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. వీధి కుక్కల సమస్యపై అఫిడవిట్ దాఖలు చేయని రాష్ట్రాలపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
‘మొంథా’ తుపాను ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తోంది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఈరోజు నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశముంది. మంగళవారం రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని ఐఎండీ అంచనా వేసింది. తుపాన్ ప్రభావం ఇప్పటికే కాకినాడలో మొదలైంది. సముద్రం దగ్గర వాతావరణం పూర్తిగా మారింది. భారీ ఈదురు గాలులు వీస్తున్నాయి. ఇక తుఫాను ప్రభావంతో నెల్లూరులోని ఉదయగిరి-కావలి ప్రాంతాలలో తేలికపాటి వర్షం మొదలైంది. తుమ్మలపెంట సముద్ర తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి.…
కోస్తా జిల్లాల వైపు ‘మొంథా’ తుపాను దూసుకొస్తోంది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. ఈరోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశముందని ఐఎండీ ఓ ప్రకటలో తెలిపింది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారి.. రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని అంచనా వేసింది. మంగళవారం 12 గంటల పాటు తీవ్ర తుపాను తీవ్రత కొనసాగి.. ఆపై తుపానుగా బలహీనపడొచ్చని చెప్పింది. తుపాను ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో…
మాజీ ఎమ్మెల్యే కేతి రెడ్డికి ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. కూటమి కార్యకర్తలకు గుండు సూది గుచ్చాలని చూసినా.. గునపాలు దిగుతాయి జాగ్రత్త అని హెచ్చరించారు. పోనీలే అని ఊరుకుంటున్నాం అని, ఇలాగే మాట్లాడితే ఉపేక్షించే పరిస్థితి ఉండదన్నారు. అధికారం అడ్డం పెట్టుకుని ఏదైనా చేస్తే ఒక్కరు కూడా ఊళ్లో ఉండలేరన్నారు. ఎవరైనా ప్రజల జోలికి వస్తానంటే తాటతీస్తాం అంటూ మంత్రి సత్యకుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేతి…
‘మొంథా’ తుఫాన్ ప్రభావం, తాజా పరిస్థితులపై సీఎం చంద్రబాబు అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ నేపథ్యంలో ఆదివారం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఎక్కడా ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకూడదని హెచ్చరించారు. ముందస్తు జాగ్రత్త చర్యలతో తక్షణం సన్నద్ధమవ్వండని సూచించారు. అత్యవసర సేవలకు ఆటంకం లేకుండా అధికార యంత్రాంగం పనిచేయాలని సీఎం అధికారులకు చెప్పారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఆ తర్వాత…