అసభ్య ప్రవర్తన కలిగిన హోంగార్డును కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు విధుల నుంచి తప్పించారు. హోంగార్డు 304 బీ.అజయ్ కుమార్ అసభ్య నృత్యాలు చేస్తూ అనుచిత ప్రవర్తన కలిగి పోలీస్ శాఖ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించడంతో.. సదరు హోంగార్డుపై క్రమశిక్షణ చర్యలకు జిల్లా ఎస్పీ ఉపక్రమించారు. ప్రజారక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ విధుల్లో పాల్గొనవలసిన హోంగార్డ్ అసభ్య నృత్యాలు చేస్తూ ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల వేదికగా విస్తృతంగా వ్యాపించడంతో విషయం ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. వాటిపై…
ఐదేళ్లలో కూటమి ప్రభుత్వం 15 లక్షల ఇళ్లులు పేదలకు ఇచ్చేలా టార్గెట్ పెట్టుకున్నాం అని ఏపీ సమాచార శాఖా మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. ‘హౌస్ ఫర్ ఆల్’ కాన్సెప్ట్‌తో కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతోందని, 5 లక్షల ఇళ్లులు ఉగాదికి పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. 2019-24 మధ్య 18 లక్షల ఇళ్లులు మంజూరు అయితే.. కనీసం 4 లక్షల ఇళ్లులు కూడా కట్టలేదని గత వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి…
ఇటీవలే ‘మొంథా’ తుఫాన్ రెండు తెలుగు రాష్ట్రాలపై పెను ప్రభావం చూపిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఏపీని అతలాకుతలం చేసింది. మొంథా కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికందిన పంట అంతా నీట మునిగింది. ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన రైతులకు మరో అశుభవార్త. అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా బలపడుతోంది. రేపటికి తుఫాన్‌గా బలపడనుందని ఐఎండీ అంచనా వేస్తోంది. తుఫాన్‌గా మారాక సెన్యార్గా నామకరణం చేయాలని ఐఎండీ భావిస్తోంది. Also Read: YS Jagan: కడప జిల్లాలో మూడు…
ఈరోజు నుంచి మూడు రోజుల పాటు కడప జిల్లాలో మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పర్యటించనున్నారు. తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో మూడు రోజులు ఉండనున్నారు. ఇవాళ మధ్యాహ్నం బెంగుళూరు నుంచి నేరుగా పులివెందులకు జగన్ చేరుకోనున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. Also Read: IND vs SA: పసలేని బ్యాటింగ్.. వైట్‌వాష్ దిశగా…
ప్రస్తుత రోజుల్లో చిన్న స్మార్ట్‌ఫోన్ దిరికితేనే.. జేబులో వేసుకుని పోతున్నారు జనాలు. కాస్త కాస్ట్లీ ఫోన్ దొరికితే ఊరుకుంటారా?.. గుట్టుచప్పుడు కాకుండా సైడ్ చేస్తారు. అందులోనూ ఐఫోన్ దొరికే.. మూడో కంటికి కూడా తెలియకుండా ఇంటికి తీసుకెళుతారు. అయితే అందరూ ఇలా ఉండరు. నూటికో, కోటికో ఒక్కరు మనసున్న మహారాజు కూడా ఉంటాడు. అందులో ఒకడే ఆంధ్రకు చెందిన ఆటో డ్రైవర్ స్వామి. తనకు కాస్ట్లీ ఐఫోన్ దొరికితే తిరిగిచ్చేశాడు. ప్రస్తుతం స్వామి పేరు సోషల్ మీడియాలో…
ఒక్కోసారి మనం చేసే ప్రయత్నాలకంటే.. ప్రత్యర్థులు చర్యలే మనకు కలిసి వస్తాయి. ప్రస్తుతం ఆ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జికి అదే కలిసి వస్తోందా..? తమ నాయకుడిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ శ్రేణులు వైసీపీ ఆఫీస్‌పై దాడి చేసి.. ఎదుటి వారికి అవకాశం ఇచ్చారా? మొన్నటి వరకు సెగ్మెంట్ అంతా కూడా తెలియనివారిని…స్టేట్ మొత్తం తెలిసేలా చేశారా?, నందమూరి బాలకృష్ణ నియోజకవర్గంలో మొన్న జరిగిన ఘటనలు ఎవరికి కలిసివచ్చాయి?. వైసిపి గ్రాఫ్ ఎలా పెంచుకోవాలని… కొన్ని…
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి విద్యార్థులకు అలర్ట్. ఏపీ టెన్త్ పరీక్షల షెడ్యూల్‌ను ఎస్ఎస్సీ బోర్డు ఈరోజు విడుదల చేసింది. ఏపీలో పదో తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరగనున్నాయి. ప్రతి రోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష జరగనుంది. మార్చి 16న ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్ష జరగనుండగా.. ఏప్రిల్ 1న ఓఎస్ఎస్సీ సెకెండ్ లాంగ్వేజ్ పరీక్ష జరగనుంది. Also Read: YS Jagan: 9 పేజీలతో..…
సీఎం చంద్రబాబుకు మాజీ సీఎం వైఎస్ జగన్ 9 పేజీలతో కూడిన లేఖ రాశారు. కృష్ణా జలాల పరిరక్షణలో వైఫల్యంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ట్రిబ్యునల్‌లో రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా వాదనలు వినిపించాలని, KWDT–2 ఎదుట జరగబోయే వాదనల్లో రాష్ట్ర ప్రయోజనాలను సమర్థవంతంగా వినిపించాలని పేర్కొన్నారు. పొరపాటు జరిగితే ఏపీ రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉందని, తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదిలో 763 టీఎంసీలను కేటాయించేందుకు ట్రిబ్యునల్ అంగీకరిస్తే ఏపీకు తీవ్ర అన్యాయం జరుగుతుందని.. ఈ…
కర్నూలు జిల్లా ఆలూరు పీఎస్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ మందుబాబు పోలీసు జీపును దర్జాగా ఇంటికి తీసుకెళ్లాడు. ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆలూరులో బుధవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పెద్దహోతూరు యువరాజు పట్టుబడ్డాడు. తన బైక్ ఇవ్వాలని, ఇంటికి వెళ్లి వస్తానని పోలీసులతో చెప్పాడు. బైక్ ఇవ్వకపోవడంతో వేరే బైక్ తీసుకుని వెళ్లాడు. ఇవాళ ఉదయం మళ్లీ బైక్ తీసుకువచ్చాడు. తన బైక్ ఇస్తే వెళ్లిపోతానని, లేకుంటే పోలీస్…
పిల్లల పెంపకంలో తల్లుల పాత్ర అత్యంత కీలకం అని నారా భువనేశ్వరి అన్నారు. చిన్నతనంలోనే విలువలు, సంస్కారం పిల్లలకు నేర్పాలని చెప్పారు. పిల్లల ఆసక్తిని గుర్తించి.. ఆ దిశగా ప్రోత్సహించాలని సూచించారు. తన కుమారుడు, మంత్రి నారా లోకేష్ ప్రజాసేవలో బిజీగా ఉండటంతో.. దేవాన్ష్ చదువు, క్రీడలను బ్రాహ్మణి చూసుకుంటోందన్నారు. గతంలో రాజకీయాల్లో బిజీగా ఉన్న చంద్రబాబు నాయుడు కారణంగా లోకేష్ పెంపకం బాధ్యత తాను తీసుకున్నాను అని భువనేశ్వరి చెప్పుకొచ్చారు. కుప్పం సామగుట్లపల్లి మండల పరిషత్…