మెగా డీఎస్సీకి ఎన్ని అవాంతరాలు ఎదురైనా విజయవంతంగా పూర్తిచేశాం అని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. 106 కేసులు ఎదుర్కొని కార్యక్రమాన్ని జయప్రదం చేశామన్నారు. మెగా డీఎస్సీ నియామకపత్రాలు అందజేతకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నను ఆహ్వానించా అని చెప్పారు. నియామక పత్రాలు అందజేత కార్యక్రమానికి తప్పకుండా వస్తానని పవన్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఇక ప్రతిఏటా ఓ పద్ధతి ప్రకారం డీఎస్సీ నిర్వహిస్తాం అని మంత్రి లోకేశ్ చెప్పుకొచ్చారు. అసెంబ్లీలోని తన ఛాంబర్లో…
కడప టీడీపీలో అసమ్మతి సెగలు తారాస్థాయికి చేరాయి. కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి, ఆమె భర్త శ్రీనివాసుల రెడ్డికి వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు బహిరంగంగా నిరసనలకు దిగాయి. సీనియర్ నాయకుడు కృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు సమావేశం అయ్యారు. అనంతరం శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కడప ఎమ్మెల్యే మాధవికి మంచి బుద్ది ప్రసాదించాలని ఆదేవుడిని కోరారు. Also Read: Abhishek Sharma: దానికోసమే వెయిటింగ్.. అభిషేక్ సోదరి…
రూ.3500 కోట్ల విలువైన ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనిఖీలు చేపట్టింది. శుక్రవారం ఉదయం ఏకకాలంలో తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలలోని 20 ప్రాంతాల్లో దాడులు జరిగాయి. మద్యం కుంభకోణం నిందితుల సంస్థలు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేశారు. లిక్కర్ స్కాంలో ఉన్న నిందితుల ఇళ్లలోనూ ఈడీ సోదాలు జరిగాయి. నకిలీ ఇన్వాయిస్లు, పెంచిన మద్యం ధరల వెనుక భారీ స్కాం…
దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈరోజు, రేపు రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో సమావేశాలు ప్రారంభంకానున్నాయి.
సొమ్మొకడిది, సోకొకడిది అన్నట్లుంది సీఎం చంద్రబాబు వ్యవహారం అని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. పనిచేసేది ఒకరు, క్రెడిట్ పొందేది మరొకరు అని.. క్రెడిట్ని దొంగిలించగలగిన సమర్థుడు చంద్రబాబు మాత్రమే అని ఎద్దేవా చేశారు. కుప్పం, రాయలసీమకు నీళ్లు ఇవ్వాలనే ఆలోచన చంద్రబాబుకి ఏరోజు రాలేదని.. బాబు ఆడే నాటకాలు, మోసాలు జనాలకు బాగా తెలుసన్నారు. మాట ఇచ్చిన ప్రకారం వైఎస్ జగన్ కుప్పానికి నీళ్లు ఇచ్ఛారన్నారు. పోలవరం పనులు సరైన, సక్రమమైన…
Women’s Safety Awareness program in AP: మహిళల భద్రతకు సంబంధించిన అంశాలను, చట్టాల సమాచారాన్ని పాఠ్య ప్రణాళికలో చేర్చాలని, ప్రతివారం విద్యార్థినిలకు వీటిపై తరగతులు నిర్వహించాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ సహకారంతో రాజమండ్రిలో జరిగిన మహిళల సంక్షేమం, భద్రత, హక్కులపై జిల్లాస్థాయి అవగాహన కార్యక్రమానికి డాక్టర్ శైలజ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.…
రుషికొండ టూరిజం రిసార్ట్లకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మంత్రులు కందుల దుర్గేష్, పయ్యావుల కేశవ్, డోల బాలవీరంజనేయస్వామి సభ్యులుగా కమిటీ ఏర్పాటు అయింది. టూరిజం స్పెషల్ చీఫ్ సెక్రెటరీ సమన్వయంతో ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది. అవసరాన్ని బట్టి టూరిజం శాఖకు సంబంధించి కొంతమంది అధికారులను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. Also Read: Pawan Kalyan: 21 ఏళ్ల వయసులోనే రాజకీయ ఆలోచనలు వచ్చాయి..…
Kathireddy Pedda Reddy React on Supreme Court Verdict: వైసీపీ సీనియర్ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట దక్కింది. అనంతపురం జిల్లా తాడిపత్రి ఎంట్రీకి పెద్దారెడ్డికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తనను తాడిపత్రిలోకి రాకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారంటూ సుప్రీంకోర్టును మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆశ్రయించారు. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. తాడిపత్రికి వెళ్లేందుకు పెద్దారెడ్డికి సెక్యూరిటీ ఇవ్వాలని కూడా…
MLA Kotamreddy Sridhar Reddy Murder Plan Video: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకి భారీ కుట్ర జరిగింది. టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డిని హత్య చేయాలని ఐదుగురు రౌడీ షీటర్లు మాస్టర్ ప్లాన్ వేసిన వీడియో ఒకటి బయటకొచ్చింది. ఎమ్మెల్యే కోటంరెడ్డిని హతమారిస్తే డబ్బే డబ్బు అంటూ రౌడీ షీటర్లు మాట్లాడుకుంటున్న సంచలన వీడియో వైరల్గా మారింది. మర్డర్ మాస్టర్ ప్లాన్ వెనుక రౌడీ షీటర్ శ్రీకాంత్ ముఖ్య అనుచరుడు…
ఏపీ లిక్కర్ కేసు నిందితులకు ఏసీబీ కోర్టు నోటీసులు పంపింది. ఆస్తులను ఆటాచ్ చేస్తూ సిట్ దాఖలు చేసిన పిటిషన్పై అభ్యంతరాలు ఉంటే చెప్పాలని 11 మందికి నోటీసులు ఇచ్చింది. పలువురు డిస్టిలరీ డైరెక్టర్లు, బ్యాంకులు, లిక్కర్ కేసులో నిందితులకు ఏసీబీ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఆస్తుల అటాచ్ చేస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన నోటీసులపై అభ్యంతరం లేదని నోటీసులు అందుకున్న పలువురు తెలిపారు. నేడు కోర్టుకు హాజరైన కేసులో నిందితుడిగా ఉన్న వరుణ్ పురుషోత్తం,…