కాసేపట్లో లోక్‌భవన్‌కు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేరుకోనున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులను గవర్నర్‌కు అందజేయనున్నారు. వైసీపీకి చెందిన 40 మందికి మాత్రమే గవర్నర్‌ను కలిసేందుకు అనుమతిని ఇచ్చారు. ఇప్పటికే కోటి సంతకాల ప్రతులు లోక్‌భవన్‌కు చేరాయి. గవర్నర్‌కు కలిసేందుకు జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరారు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లాల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులతో జగన్ విజయవాడ బయలుదేరారు.…
ఉమ్మడి విశాఖ జిల్లా కూటమి ఎమ్మెల్యేలు కొందరు డిఫెన్స్‌లో పడుతున్నారా? రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న వేల కోట్ల రూపాయల పెట్టుబడుల మాటలు వాళ్ళలో పొలిటికల్ భరోసా కల్పించకపోగా… కాళ్ళ కింద భూమి కదులుతున్నట్టు ఫీలవుతున్నారా? సెల్ఫ్ డిఫెన్స్‌కు కూడా ఛాయిస్ లేకుండా పోతోందా? ఎవరా ఎమ్మెల్యేలు? వాళ్ళ భయం ఏంటి? పవర్, పొజిషన్‌తో మైలేజ్ పాలిటిక్స్ చేద్దామనుకుంటున్న ఉమ్మడి విశాఖ జిల్లా కూటమి ఎమ్మెల్యేల్లో కొందరి పరిస్ధితి అడకత్తెరలోపడినట్టే కనిపిస్తోంది. నేలనపోయే కష్టాలన్నీ వాళ్ళ నెత్తినెక్కి తాండవం చేస్తున్నాయా….…
నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో వైసీపీ రివర్స్ గేమ్ ఆడిందా? నెగ్గలేమని తెలిసి కూడా.. పావులు కదిపి అధికార పార్టీని గిల్లి గిచ్చి… గబ్బులేపుదామని భావించిందా? ఆ విషయంలో ప్రతిపక్షం ఎంతవరకు సక్సెస్ అయింది? సైకిల్ నాయకులు ఫ్యాన్ ట్రాప్‌లో పడ్డారా? దాని గురించి జిల్లాలో ఏమనుకుంటున్నారు? నెల్లూరు నగర మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానానికి టీడీపీ నోటీసులు ఇవ్వడం, గతంలో వైసీపీ నుంచి సైకిలెక్కిన కొందరు కార్పొరేటర్లు తిరిగి సొంత గూటికి చేరడం, అధికార పార్టీ అలర్ట్…
సంక్షేమ శాఖలపై జిల్లా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు. సూపర్ సిక్స్, ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించి ఓ క్యాలెండర్ రూపోందించాలని.. సూపర్ సిక్స్ పథకాల అమలుతో ప్రజలు సంతృప్తి చెందాలన్నారు. పార్వతిపురం మన్యం జిల్లాలో జరుగుతోన్న ముస్తాబు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయండని, హాస్టళ్లలో విద్యార్ధులకు ఏం జరిగినా ముందు సస్పెండ్ చేసి ఆ తర్వాత మాట్లాడతానని హెచ్చరించారు. కలెక్టర్లతో మొదటి…
కేంద్ర ప్రయోజిత పథకాలు, నిధుల వినియోగంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కొన్ని శాఖలు, కొన్ని జిల్లాల్లో కేంద్ర నిధుల్ని పూర్తి స్థాయిలో వినియోగించకపోవడం సరికాదన్నారు. ఖర్చు పెట్టకుండా మిగిలిపోయిన కేంద్ర నిధులను జనవరి 15వ తేదీ నాటికి ఖర్చు పెట్టేయాలని సీఎం ఆదేశించారు. సమగ్ర శిక్షా పథకం కింద రూ.1363 కోట్లకు రూ.1259 కోట్లు ఖర్చు పెట్టామని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. పెండింగులో ఉన్న నిధులను కూడా త్వరితగతిన ఖర్చు పెడతామని మంత్రి చెప్పారు.…
మాజీ సీఎం వైఎస్ జగన్ విజన్‌తో 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారని, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రి ఉండాలన్నది సంకల్పించారని వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రభుత్వ వైద్యశాలలు వస్తే ఆరోగ్యశ్రీ ఖర్చులు తగ్గుతాయని జగన్ భావించారన్నారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారని మండిపడ్డారు. విద్య, వైద్యం పూర్తిగా ప్రైవేట్ పరం అయితే ప్రభుత్వం ఉండి ఏం లాభం అని.. ఇది…
ప్రజా ఫిర్యాదులకు సంబంధించి 2026 జనవరి నుంచి జిల్లాల్లో ఏప్ సీఎం చంద్రబాబు నాయుడు ఆకస్మిక పర్యటనలు చెయ్యనున్నారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల పైన జిల్లాలో ఆకస్మిక తనిఖీ చేస్తానని కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం ప్రకటించారు. ఇప్పటికే ఈ ఫైల్స్ క్లియరెన్స్ విషయంలో జనవరి 15ను డెడ్ లైన్‌గా ప్రకటించారు. అమరావతిలోని సచివాలయంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. పలు అంశాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. Also Read: Telangana MLAs…
ఎవరు? ఆ లీకు వీరులెవరు..? ప్రధాని మోడీతో తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీల మీటింగ్ వివరాలను బయటికి చెప్పిందెవరు?.. దీని గురించి బయట ఎక్కడా చర్చ జరక్కూడదని స్వయంగా మోడీ చెప్పినా సరే.. లీక్ చేసింది ఎవరు? అనుమానపు చూపులు ఎటువైపు ఉన్నాయి? పార్టీ వర్గాలు ఏమంటున్నాయి?. కర్ణాటక మినహా దక్షిణాది రాష్ట్రాల బీజేపీ ఎంపీలతో ఇటీవల ప్రత్యేకంగా సమావేశమయ్యారు ప్రధాని మోడీ. ఆయా రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు, పార్టీ పని తీరుపై ఆరా తీశారు. ఇప్పటిదాకా…
జనసేన పార్టీ స్థాపించిందే ప్రశ్నించడానికి అని చెప్పిన పవన్ కళ్యాణ్.. డిప్యూటీ సీఎం అయ్యాక కూడా ప్రశ్నించకుండా ముసిముసి నవ్వులు నవ్వుతున్నారని మాజీ మంత్రి, వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శించారు. గ్రామాల్లోకి వెళ్ళి చూడండని.. కూల్ డ్రింక్స్ ఎలా దొరుకుతాయో మందు అలానే దొరుకుతుందని ఎద్దేవా చేశారు. ఇంత మద్యం అమ్మిన మూడు శాతమే ఆదాయం ఎందుకు పెరిగిందని.. పది శాతం పెరగాల్సిన ఆదాయం మూడు శాతం ఎలా ఉంది.. ఎవరి చేతిలోకి ఆదాయం వెళ్తుందని…
రాష్ట్రంలో డ్రగ్స్ పైన నిఘా పెట్టాలని, ఈగల్ ఉందని డ్రగ్ కంట్రోల్ అధికారులు ఆగాల్సిన పని లేదని ఏపీ వైద్య ఆరోగ్య శాఖామంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. డ్రగ్స్ పని చేయనివి కూడా మార్కెట్లో దొరుకుతున్నాయని, తనకే అలాంటి పరిస్ధితి ఎదురైందన్నారు. ఎక్స్పైరీ మందులు, నిషేధించిన మందులు కూడా దొరుకుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ ప్రభుత్వంలో జనరిక్, జన ఔషధి కేంద్రాలు తీసుకొచ్చారని సత్యకుమార్ తెలిపారు. శ్రీకాకుళం, విశాఖ, అమలాపురం, నరసరావుపేట, ఒంగోలు, కావలి,…