AP New Districts: కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది నోటిఫికేషన్ విడుదల.. రేపటి నుంచి ఏపీలో 28 జిల్లాలు!
- కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది నోటిఫికేషన్ విడుదల
- రేపటి నుంచి ఏపీలో 28 జిల్లాలు
- రెవెన్యూ డివిజన్లు, మండలాలు మార్పులు చేస్తూ నోటిఫికేషన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది నోటిఫికేషన్ విడుదలైంది. మార్కాపురం, పోలవరం జిల్లాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేసింది. రంపచోడవరం హెడ్ క్వాటర్‌గా పోలవరం జిల్లా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అలానే మార్కాపురం హెడ్ క్వాటర్‌గా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. బుధవారం (డిసెంబర్ 31) నుంచి కొత్త జిల్లాల ఏర్పాటు అమల్లోకి తీసుకువస్తూ తుది ఉత్తర్వులు జారీ చేసింది.
2 కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 26 నుంచి 28కి పెరిగింది. అన్నమయ్య జిల్లా హెడ్ క్వాటర్‌ను రాయచోటి నుంచి మదనపల్లికి మార్చుతూ తుది నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలో కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ.. అలానే పలు రెవెన్యూ డివిజన్లు, మండలాలు సరిహద్దులు మార్పులు చేస్తూ తుది నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. రేపటి నుంచే సరిహద్దుల మార్పులు అమల్లోకి వస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది.
Also Read
Also Read: Sara Arjun History: 20 ఏళ్లకే అరుదైన రికార్డ్.. ఏ హీరోయిన్‌కు దక్కని క్రెడిట్ సారా సొంతం!
నందిగామ మండలాన్ని పలాస రెవెన్యూ డివిజన్ నుంచి టెక్కలికి.. సామర్లకోట మండలాన్ని కాకినాడ డివిజన్ నుంచి పెద్దపురానికి మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లా రీస్ట్రక్చర్ చేస్తూ ఉత్తర్వులు జారీ కాగా.. పెనుగొండను వాసవీ పెనుగొడంగా మారుస్తూ తుది నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అనకాపల్లి జిల్లాలో అడ్డరోడ్డు జంక్షన్ రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు కానుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మండలాలను మార్చుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రేపటి నుంచి రెవెన్యూ డివిజన్ల మార్పులు, చేర్పులు అమల్లోకి రానున్నాయి.
ప్రస్తుతం 77 రెవెన్యూ డివిజన్‌లు ఉండగా.. కొత్తగా 5 రెవెన్యూ డివిజన్‌లు జత అవుతున్నాయి. మొత్తంగా 82 రెవెన్యూ డివిజన్‌లు కానున్నాయి. అడ్డరోడ్డు జంక్షన్, పీలేరు, బనగానపల్లి, మడకశిర, అద్దంకిలు కొత్త రెవెన్యూ డివిజన్‌లు. 679 ఉన్న మండలాలు రేపటి నుంచి 681 మండలాలు కానున్నాయి. ఆదోని 1, ఆదోని 2 రెండు కొత్త మండలాలు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!