తాను డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. భగవంతుడు సంకల్పంతో తాను పిఠాపురం వచ్చానని, అధికారం ఉన్నా లేకపోయినా పిఠాపురం ప్రజలు కోసం పని చేస్తానని చెప్పారు. పిఠాపురంలో పక్షి ఈక పడినా ఏదో జరిగిందని కొందరు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో మాదిరి పిఠాపురంకి వచ్చి గొడవలు చేద్దామనుకుంటే ఏరి వేస్తా అని వార్నింగ్ ఇచ్చారు. దేశం కోసం పని చేసేవాడిని పండగలకు, పబ్బాలకు రాలేదని అంటున్నారని పవన్ ఫైర్ అయ్యారు. కాకినాడలో పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాల్లో పాల్గొన్న పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘కొబ్బరి ఆకు పడ్డా, తాటాకు ఊడి పడినా.. పిఠాపురంలో అయ్యా బాబోయి, అమ్మో అంటున్నారు. చెడు వార్తలకి మీరు బలం ఇస్తున్నారు. మీరు ఎదురు తిరగకపోతే మంచిది కాదు. తెలంగాణ ప్రాంత ప్రజలు గోదావరి జిల్లాల సంక్రాంతి ఆతిధ్యం తీసుకొవాలి. సంక్రాంతికి హరిదాసులు, జానపద కళాకారులకు ధాన్యం ఇస్తాం. తెలంగాణకు ఆంధ్రా ప్రాంత ప్రేమను తీసుకెళ్లండి’ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ‘కూలగొట్టడం, పడగొట్టడం చాలా తేలిక. కూటమి ఏర్పాటు చేయడం ఈజీ, చెడగొట్టడం తేలిక. నా దగ్గర చానల్స్ లేవు. దేశం కోసం పని చేస్తున్న వ్యక్తిని పేరంటాలకు ,పబ్బాలకి రాలేదు అంటే ఎలా?. స్కూల్లో ఇద్దరు పిల్లలు కొట్టుకుంటుంటే దానికి కులాలు తీసుకుని వస్తారు. బాబాయిని చంపితే అది న్యూస్ రాదు’ అని డిప్యూటీ సీఎం మండిపడ్డారు.
Also Read: Toxic Remunerations: ‘టాక్సిక్’ తారలకు భారీ రెమ్యూనరేషన్స్.. కియారా, నయనతారకు ఎంతో తెలుసా?
‘గోదావరి జిల్లాలలో కోడి పందాలలో కోట్లు రూపాయలు చేతులు మారుతాయనే సంస్కృతి పోవాలి. కోడి పందాలు,పేకాట, జూదం చేసుకునే వాళ్లు చేసుకుంటారు. సంక్రాంతి అంటే అవి మాత్రమే అంటే రాంగ్ ఇండికేషన్ వెళ్తుంది. నేను ఒక్క దానికే పరిమితం అయితే, నా బలం చంపేసినట్లు అవుతుంది. మీరు గొడవ పెట్టుకోవాలనుకుంటే నేను సిద్ధం. డబ్బు కోసం రాజకీయాలకి రాలేదు. సినిమా ఫ్లాప్ అయినా డబ్బులు తెచ్చుకోగలను. పిఠాపురంకి వచ్చి గొడవలు చేద్దామనుకుంటే ఇక్కడ కూర్చుని ఏరి వేస్తాను. గత ప్రభుత్వం భూతులు తిట్టడం, కేసులు పెట్టడం మాత్రమే చేశారు. పిఠాపురంలో మళ్ళీ అలాంటివి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు లా అండ్ ఆర్డర్ విషయంలో కఠినంగా ఉండాలి. నా మాటలు చాలా మెత్తగా ఉంటాయి కానీ. చాలా గట్టిగా తీసుకుంటాను. చాలా పర్సనల్‌గా తీసుకుంటాను. భగవంతుడు సంకల్పంతో పిఠాపురం వచ్చాను. ఆఖరి శ్వాస వరకు అధికారం ఉన్నా లేకపోయినా పిఠాపురం ప్రజలు కోసం పని చేస్తాను. చంద్రబాబు గారి అనుభవం రాష్ట్రానికి చాలా అవసరం’ అని పవన్ చెప్పుకొచ్చారు.