ప్రస్తుత సమాజంలో రోజురోజుకూ మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. కామాంధులు కొందరు వావి వరుసలు లేకుండా మృగాళ్లుగా మారుతున్నారు. శారీరక సుఖం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. రక్తం పంచుకొని పుట్టిన బిడ్డలపైనే.. కామాంధులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కన్న కూతురిపైనే అత్యాచారం చేసిన దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో వెలుగుచూసింది.
Also Read: Puri Jagannadh: డైరెక్టర్ పూరి పరిస్థితేంటి?.. అసలేమైంది?
చిత్తూరు జిల్లాకు చెందిన పెద్దబ్బకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య కూతురు అయిన బాలికను చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక నానమ్మ కొడుకు పెద్దబ్బను అడ్డుకోగా.. ఆమెపై దాడి చేశాడు. గ్రామంలోకి వెళ్లి స్థానికులను తీసుకొచ్చే లోపు పెద్దబ్బ బాలికపై అత్యాచారం చేసి పరార్ అయ్యాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పెద్దపంజాణి పోలీసులు నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు చేశారు. పోలీసులు పెద్దబ్బ కోసం గాలిస్తున్నారు. పెద్దబ్బ చేసిన దారుణంపై కుటుంబసభ్యులు, గ్రామస్థులు ఆగ్రహంగా ఉన్నారు.