సీఎం క్యాంపు కార్యాలయంలో వైయస్సార్ వాహనమిత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా మూడో విడత ఆర్థిక సాయాన్ని సర్కార్ విడుదల చేసింది. అనంతరం సిఎం జగన్ మాట్లాడుతూ.. పాదయాత్ర సమయంలో ఏలూరు సభలో మే 14, 2018న మాట ఇచ్చామని.. ఆటోడ్రైవర్లు నా దగ్గరకు వచ్చి బాధలు చెప్పుకున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో బాదుడు ఎక్కువైంది, పెనాల్టీలు ఎక్కువైపోతున్నాయని ఆవేదన చెందారని.. అప్పులు తెచ్చి ఇన్సూరెన్స్, మరమ్మతులు, పెనాల్టీలు కడుతున్నామని చెప్పారని వెల్లడించారు. వారికిచ్చిన మాటను నిలబెట్టుకుంటూ…
కడప జిల్లా : బ్రహ్మంగారి మఠం వివాదం రోజు రోజుకు ముదురుతోంది. బ్రహ్మంగారి మఠంలో విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మెన్ శ్రీకాంత్ పై నిన్న కొందరు దాడికి ప్రయత్నం చేశారు. అయితే ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందింది. దాడికి పాల్పడిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఈ దాడికి ప్రయత్నించిన ఘటనలో ఐదు మందిపై కేసు నమోదు అయింది. బంకు శీను, దీప్తి రమణారెడ్డి బాబ్జి, శ్రీ రాములు నారాయణ రెడ్డి అనే వ్యక్తులపై 452,…
టిడిపిపై ఏపీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. త్వరలోనే రాజధాని తరలింపు ఖాయమని… స్వార్థంతో కూడిన ప్రభుత్వం మాది కాదని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో పోలవరం పూర్తి చేస్తామన్నారు ఏమైనా చేసారా….. పోలవరం ప్రాజెక్టుకు అంకురార్పణ చేసి 24 క్లియరెన్స్ గాను 23 క్లియరెన్స్ పూర్తి చేసి దానికి రూపు రేఖలు తెచ్చింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. రఘురామకృష్ణరాజు రాజకీయం కోసం అనేక లేఖలు రాసుకుంటే ఎవరూ నమ్మే…
ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల రద్దు కోసం టీఎన్ఎస్ఎఫ్ వెరైటీగా నిరసన చేస్తుంది. టీడీపీ కార్యాలయం దగ్గర పీపీఈ కిట్లు ధరించి ఆందోళన చేస్తున్నారు. కోవిడ్ సమయంలో అధికారిక సమావేశాలు నిర్వహించ లేనప్పుడు పరీక్షలు ఏ విధంగా నిర్వహిస్తారని అంటున్నారు. రాష్ట్రంలో సుమారు 40 లక్షల మంది విద్యార్థులు వైరస్ బారిన పడే ప్రమాదం ఉంది. విద్య శాఖ మంత్రి వెంటనే పరీక్షలు రద్దు ప్రకటించాలి. 14 రాష్ట్రాలు 10 11 తరగతి పరీక్షలు రద్దు చేసినప్పుడు…
నాకు 750 కోట్లు విలువ చేసే భూములు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారు. 49 ఎకరాలు నా ఆధీనంలో ఉందని నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. విజయసాయిరెడ్డి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు. నిరూపించ లేకపోతే విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర నుండి వెళ్ళిపోతారా.. పార్టీ మారలేదని కక్షతో చేసారా అని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం చేసాను అని అక్కసుతో వేధిస్తున్నారా. మంత్రి గారు అరెస్టు చేస్తామని…
నెల్లూరును రెండు మూడు సంవత్సరాల్లో మార్చేస్తానని చెప్పాను.. అందుకు అనుగుణంగానే పనిచేస్తున్నాను అని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. ఐదారు వందల కోట్లు గ్రాంట్ రూపంలో తీసుకొని వచ్చాము. 100 కోట్లతో తో పెన్నా నది పై ఇంకో బ్రిడ్జి వస్తుంది ట్రాఫిక్ సమస్య మొత్తం తీరిపోతుంది. నేను ఎటువంటి పనులు చేశానో నెల్లూరు ప్రజలకు తెలుసు. సర్వేపల్లి కాలువ పక్కన 1,250 ఇళ్ళు ఉన్నాయి… అందులో 4,5 ఇళ్ల కే ప్రమాదం ఉంది… అందరికీ అండగా…
ఏపీలో ప్రభుత్వ వైన్ షాపుల్లో చేపట్టిన తనిఖీలు ముగిసాయి. జిల్లా వ్యాప్తంగా 266 మద్యం దుకాణాల్లో లెక్కలు బయటకు తీశాయి ప్రత్యేక బృందాలు. సర్కిల్-4 పరిధిలోని వైన్ షాపుల్లో గోల్ మాల్ వెలుగు చుసిన విషయం తెలిసిందే. 35 లక్షల ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టించారు సిబ్బంది. సిఐ నాగశ్రీనివాస్ ప్రమేయం నిర్ధారణ కావడంతో అతని పై వేటు పడింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్.ఐ.విమలాదేవి, ముగ్గురు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు వేశారు. అయితే ఆ నాలుగు షాపుల్లో…
రెండు సంవత్సరాలలో అని సంక్షేమ పథకాలు అమలు చేశాం. దాదాపు 90 శాతం పూర్తి చేశాం. మిగిలిన 10 శాతం కూడా అమలు చేస్తాం. ప్రజలు నమ్మకం పెట్టుకొని ఓట్లు వేసినందుకు వారికి న్యాయం చేస్తున్నాం అని ఎమ్మెల్యే కాకాని గోవర్దన్ రెడ్డి అన్నారు. ఎన్నికల మేనిఫెస్టో ను పవిత్ర గ్రంథంగా భావించి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. కరోనాతో తల్లితండ్రులు చనిపోయిన పిల్లలకు 10 లక్షల ఆర్థిక సహాయం ఆదిస్తుంది ప్రభుత్వం. తల్లిదండ్రులలో ఒక్కరూ చనిపోయిన…