పార్టీలో ఎవరు చేరాలనుకున్నా అన్ కండీషనల్ గా రావాల్సిందే అని మంత్రి కొడాలి నాని అన్నారు. కనకదుర్గమ్మ, శ్రీశైలం గుళ్ళల్లో క్షుద్రపూజలు చేసిన వ్యక్తి చంద్రబాబు. వైఎస్ రాజశేఖరరెడ్డి అనే మహా వృక్షంలో చిన్న చిగురు జగన్. ఆ చిగురు ఇవాళ మహా వృక్షమయ్యింది. జగన్మోహన్ రెడ్డి పై చంద్రబాబు, ఆయన తాబేదారులు, కొన్ని మీడియా సంస్థలు విషం కక్కుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పై అసత్య ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోం. కొంత మంది రాజశేఖర్ రెడ్డిని రాక్షసుడు అంటున్నారు. రాజశేఖర్ రెడ్డిని రాక్షసుడు కాదు రక్షకుడు. ఈ రాష్ట్రం ముక్కలు అవ్వకుండా కాపాడారు. వైఎస్ మరణం తో ఈ రాష్ట్రం కుక్కలు చించిన విస్తరిగా మారింది. తమ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవాలని ప్రతి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. జగన్ రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో వెనుక అడుగు వేసే ప్రసక్తే లేదు అని తెలిపారు.