అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులపై రౌడీషీట్లు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిన్న కార్యకర్తకు కష్టమొచ్చినా.. నేనున్నంటూ వాలిపోతారు ఆ జిల్లాలోని టీడీపీ నేతలు. అరెస్ట్‌లు చేస్తే అక్రమమని అండగా నిలుస్తారు. అలాంటిది పార్టీలో ముఖ్యమైన నాయకుడి కుటుంబానికి ఇబ్బందొస్తే సొంతవారితోపాటు పార్టీవాళ్లెవరూ కిమ్మనలేదు. టీడీపీలో ఎవరా ముఖ్యనేత? పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి?
2019 తర్వాత రాజకీయంగా ఎదురు దెబ్బలు
Also Read
శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది కింజరాపు ఎర్రన్నాయుడు కుటుంబం.
జిల్లాతోపాటు టెక్కలిలోనూ వారి ఆధిపత్యం నేటికీ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఎర్రన్నాయుడు సోదరుడు అచ్చెన్నాయుడు ఉన్నారు. ఎర్రన్న తనయుడు రామ్మోహన్‌నాయుడు శ్రీకాకుళం ఎంపీ. ఆయన కుమార్తె ఆదిరెడ్డి భవానీ రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే. ఇంతటి బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ కింజరాపు కుటుంబానికి 2019 ఎన్నికల తర్వాత రాజకీయంగా వరస దెబ్బలు తగులుతూనే ఉన్నాయి.
అచ్చెన్న బంధువులు ముగ్గురిపై రౌడీషీట్లు
టెక్కలిలో ఎమ్మెల్యేగా గెలిచి చురుకైన పాత్ర పోషిస్తోన్న అచ్చెన్నాయుడు ఏసీబీ కేసులో జైలుకెళ్లాల్సి వచ్చింది. ఏపీ టీడీపీ అధ్యక్షుడైన తర్వాత పంచాయతీ ఎన్నికల్లోనూ కేసులతో నలిగిపోయారు. ప్రస్తుతం అచ్చెన్న కుటుంబానికి చెందిన ముగ్గురిపై రౌడీషీట్స్ తెరిచారు. అచ్చెన్న అన్నయ్య హరివరప్రసాద్‌తోపాటు హరిప్రసాద్ కుమారుడు సురేష్, సమీప బంధువు కృష్ణమూర్తిపై కోటబొమ్మాళి పోలీసులు రౌడీషీట్లు తెరిచారు. హరివరప్రసాద్, కృష్ణమూర్తిపై 2088, 2010లో క్రిమినల్ కేసులున్నాయి.
read also : సీఎం కేసీఆర్ తో భేటీపై కాంగ్రెస్‌లో విమర్శల జల్లు!
22 మందిపై నాన్‌బెయిల్‌బుల్ కేసులు
పంచాయతీ ఎన్నికల్లో నిమ్మాడలో ఓ రేంజ్‌లో పొలిటికల్ రగడ జరిగింది. వైసీపీ బలపర్చిన కింజరాపు అప్పన్నను నామినేషన్ వేయకుండా అడ్డుకోవడంతో నాటకీయ పరిణామాలు సంభవించాయి. ఆ సమయంలో పోలీసుల విధినిర్వహణకు ఆటంకం కల్పించారని ఆరోపణలు రావడంతో అచ్చెన్న కుటుంబసభ్యులు 22 మందిపై నాన్‌బెయిల్‌బుల్ కేసులు నమోదయ్యాయి. అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్ట్ చేయగా హరివరప్రసాద్, సురేష్‌లు బెయిల్ తెచ్చుకున్నారు. అప్పట్లో హరివరప్రసాద్, సురేష్, అచ్చెన్నాయుడి సమీప బంధువు కృష్ణమూర్తిపై కోటబొమ్మాళి పోలీసులు బైండోవర్లు ఓపెన్ చేశారు. సీన్ కట్ చేస్తే ఈ కేసులు పెట్టిన 4 నెలల తర్వాత ఇప్పుడు రౌడీషీట్లు ఓపెన్ చేయడం చర్చగా మారింది.
రౌడీషీట్లు తెరిచినా కిమ్మనని తెలుగు తమ్ముళ్లు
బైండోవర్ రూల్స్ ఉల్లంఘించడంతోపాటు పాత కేసులు ఉండటంతో రౌడీషీట్లు ఓపెన్ చేశామన్నది పోలీసుల వాదన. అయితే ఇది కక్షపూరిత చర్యగా ఆరోపిస్తోంది టీడీపీ. కింజరాపు కుటుంబంపై ఈగవాలినా ఊరుకోని తెలుగు తమ్ముళ్లు.. ఈ ఎపిసోడ్‌లో మాత్రం కిమ్మనకపోవడం ఆశ్చర్య పరుస్తోంది. జిల్లాలో టీడీపీకి అనేక మంది ముఖ్యనేతలు ఉన్నా.. ఒక్కరూ స్పందించలేదు. పార్టీలో చిన్న కార్యకర్తపై కేసుపెడితే అక్రమం అని రోడ్డెక్కే నాయకులు ఇప్పుడు ఎక్కడున్నారో తెలియడం లేదట.
జరిగేదేదో జరుగుతుందని ఊరుకున్నారా?
అచ్చెన్నను అరెస్ట్ చేసిన సమయంలో నల్ల జెండాలు పట్టుకుని నిరసన తెలియజేసిన తెలుగు తమ్ముళ్లు కామైపోయారు. పార్టీ నేతల సంగతి కాసేపు పక్కన పెడితే.. ఈ చర్యలపై అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌నాయుడు సైతం స్పందించడానికి ఆసక్తి చూపించలేదు. ఏం మాట్లాడాలో కూడా పార్టీ నేతలకు ఆదేశాలు ఇవ్వలేదట. ఈ పరిణామాలే జిల్లా రాజకీయాలలో చర్చగా మారాయి. జరిగేదేదో జరుగుతుంది.. మన ప్రభుత్వం వచ్చినప్పుడు చూసుకుందాంలే అనే ధోరణిలో అచ్చెన్నాయుడు ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే రౌడీషీట్లపై ఆయన నో కామెంట్ అన్నారట. నాయకుడే మౌనంగా ఉంటే మనకెందుకు.. మనమూ మౌనంగా ఉంటే సరిపోతుందని ఎక్కడి వారు అక్కడే గప్‌చుప్ అయ్యారట పార్టీ శ్రేణులు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?